Share News

Hyderabad: వామ్మో..! హాటళ్లలో ఇలాంటి ఫుడ్ పెడుతున్నారా.. అధికారుల తనిఖీల్లో షాకింగ్ దృశ్యాలు..

ABN , Publish Date - May 21 , 2024 | 02:28 PM

పైకి చూస్తే రిచ్‌గా కనిపిస్తోందని హాటల్‌కు వెళ్లి భోజనం చేశామంటే.. మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకున్నట్లే. ఎందుకంటే ఇటీవల కొన్ని హోటల్ యజమానులు నాణ్యత ప్రమాణాలను గాలికొదిలేశారు. కల్తీ ఆహార పదార్థాలతో ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. ఇందుకు హైదరాబాద్ నగరమే నిదర్శనం. తాజాగా...

Hyderabad: వామ్మో..! హాటళ్లలో ఇలాంటి ఫుడ్ పెడుతున్నారా.. అధికారుల తనిఖీల్లో షాకింగ్ దృశ్యాలు..

హైదరాబాద్ : పైకి చూస్తే రిచ్‌గా కనిపిస్తోందని హాటల్‌కు వెళ్లి భోజనం చేశామంటే.. మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకున్నట్లే. ఎందుకంటే ఇటీవల కొన్ని హోటల్ యజమానులు నాణ్యత ప్రమాణాలను గాలికొదిలేశారు. కల్తీ ఆహార పదార్థాలతో ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. ఇందుకు హైదరాబాద్ నగరమే నిదర్శనం. తాజాగా, అధికారులు నగరంలోని పలు హోటళ్లలో తనిఖీలు చేపట్టగా షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.


hyderabadh-crime-news.jpg

హైదరాబాద్ (Hyderabad) నగంరలోని పలు హోటళ్లు, సూపర్ మార్కెట్లపై టాస్క్ ఫోర్స్ దాడులు మంగళవారం దాడులు చేశారు. ఈ సందర్భంగా పలు హోటళ్లో కల్తీ ఆహార పదార్థాలను సీజ్ చేశారు. రత్నదీప్ సూపర్ మార్కెట్లో నాసిరకం చాక్లెట్లు లభ్యమయ్యాయి. అలాగే జంబో కింగ్ బర్గర్లో క్వాలిటీ లేని పిజ్జాలు సీజ్ చేశారు. కామత్ హోటల్లో నాణ్యత లేని టీ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. షా గౌస్ హోటల్లో నాసిరకం వంటలతో పాటూ కిచెన్‌లో అపరిశుభ్రతను గుర్తించారు.


hyderabadh-hotel-food.jpg

నాణ్యత లేని ఆహార పదార్థాలు తయారు చేయడంపై అధికారులు సీరియస్ అయ్యారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు (Food Safety Authorities) నెల రోజులుగా నగరంలో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. మొత్తం ముగ్గురు సభ్యులతో కూడిన టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. వివిధ రకాల హోటళ్ల నుంచి శాంపిల్స్ సేకరించారు. దాదాపు 29 శాంపిల్స్ నిబంధనలకు విరుద్ధంగా గుర్తించారు. రిపోర్ట్స్ ఆధారంగా సదరు హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోనుకున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - May 21 , 2024 | 02:28 PM