Apollo: తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా.. అపోలోలో బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ సర్వీస్
ABN , Publish Date - Jun 20 , 2024 | 05:30 AM
బోన్ మ్యారో(ఎముక మజ్జ) క్యాన్సర్ చికిత్సకు ఇకపై రోజుల తరబడి ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం లేదు..! ఆస్పత్రికి రాగానే.. చికిత్స చేయించుకుని, ఆ వెంటనే ఇంటికి వెళ్లొచ్చు.
హైదరాబాద్ సిటీ, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): బోన్ మ్యారో(ఎముక మజ్జ) క్యాన్సర్ చికిత్సకు ఇకపై రోజుల తరబడి ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం లేదు..! ఆస్పత్రికి రాగానే.. చికిత్స చేయించుకుని, ఆ వెంటనే ఇంటికి వెళ్లొచ్చు. ఈ మేరకు హైదరాబాద్‌లోని అపోలో క్యాన్సర్ సెంటర్స్(ఏసీసీ) తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి ఔట్ పేషెంట్ ‘బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ సర్వీ్‌స’ను అందుబాటులోకి తీసుకువచ్చింది. బుధవారం జరిగిన సమావేశంలో అపోలో-హైదరాబాద్ సీఈవో తేజస్వీ వీరేపల్లి, సీనియర్ కన్సల్టెంట్(హెమటో ఆంకాలజీ) డాక్టర్ పద్మజాలోకిరెడ్డి, గ్రూప్ ఆంకాలజీ ప్రెసిడెంట్ దినేశ్ మాధవన్, డాక్టర్ సునీత, నేహా కుమారి నాగ్ వివరాలను వెల్లడించారు.
బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ సర్వీస్ వల్ల రోగులకు 50ు వరకు ఖర్చు తగ్గుతుందని, రోగి వెంట కేర్‌టేకర్/కుటుంబ సభ్యులు ఉంటే సరిపోతుందని వారు పేర్కొన్నారు. రోగులు ఇకపై రోజుల తరబడి ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఉండబోదని, ఇంటి వద్దే కుటుంబంతో గడపవచ్చని వివరించారు.