Share News

Hyderabad: ఎవరి అభ్యంతరాలు వారికుంటాయి..

ABN , Publish Date - Jun 17 , 2024 | 03:06 AM

విద్యుత్తు కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి పవర్‌ప్లాంట్లపై వివరణ ఇస్తూ మాజీ సీఎం కేసీఆర్‌ పంపిన లేఖ తమకు అందిందని విద్యుత్తు ఒప్పందాలపై విచారణ జరుపుతున్న కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి తెలిపారు.

Hyderabad: ఎవరి అభ్యంతరాలు వారికుంటాయి..

  • కేసీఆర్‌ చెప్పిన విషయాలను

  • వాస్తవాలతో సరిపోల్చుతాం

  • బీహెచ్‌ఈఎల్‌ ప్రతినిధులనూ వివరాలు అడుగుతాం

  • లేఖలో పేర్కొన్న అభ్యంతరాలపై

  • పునఃపరిశీలన చేస్తాం

  • సమీక్ష తర్వాతే తదుపరి చర్యలు

  • జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి పవర్‌ప్లాంట్లపై వివరణ ఇస్తూ మాజీ సీఎం కేసీఆర్‌ పంపిన లేఖ తమకు అందిందని విద్యుత్తు ఒప్పందాలపై విచారణ జరుపుతున్న కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి తెలిపారు. ఆ లేఖకు సంబంధించిన అంశాలను ఆదివారం ఓ మీడియా సంస్థతో ఆయన ప్రస్తావించారు. ఛత్తీ్‌సగఢ్‌ విద్యుత్తు కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల అంశాల్లోని కొన్ని ప్రశ్నలకు కేసీఆర్‌ తన లేఖలో సమాధానం ఇచ్చారని తెలిపారు. కేసీఆర్‌ చెప్పిన విషయాలను నిపుణుల కమిటీతో చర్చించాల్సి ఉందన్నారు. ఏ అంశంపైనైనా ఎవరి అభ్యంతరాలు వారికి ఉండటం సహజమని అన్నారు.


కేసీఆర్‌ చెప్పిన వివరాలను వాస్తవాలతో సరిపోల్చవలసి ఉంటుందని, ఇందులో వాస్తవాలపై బీహెచ్‌ఈఎల్‌ ప్రతినిధులను కూడా వివరాలు అడుగుతామని చెప్పారు దీనిపై మంగళవారం సమీక్షించి విశ్లేషణ జరుపుతామని, దానికి అనుగుణంగానే తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఎవరికైనా తమ అభిప్రాయాలను చెప్పే ేస్వచ్ఛ నిస్సందేహంగా ఉంటుందని, మాజీ సీఎం తెలిపిన అభ్యంతరాలపై పునఃపరిశీలన జరుపుతామని జస్టిస్‌ నరసింహారెడ్డి వ్యాఖ్యానించారు. విచారణాంశాలను మీడియాకు వెల్లడించారన్న అంశంపై స్పందిస్తూ.. తాను జరిగిన పరిణామాలను మాత్రమే మీడియా ముఖంగా వివరించానని చెప్పారు.

Updated Date - Jun 17 , 2024 | 03:06 AM