Mallareddy: మాకూ ‘మూడు’ కావాలి.. రాజకీయాల నుంచి తప్పుకుంటే గోవాలో అదే పని చేస్తా..!
ABN , Publish Date - Feb 09 , 2024 | 06:45 PM
తెలంగాణ రాజకీయాలతో పాటూ సోషల్ మీడియాలోనూ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా ఉండే మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చిట్ చాట్‌లో భాగంగా ఆయన మీడియాతో ముచ్చటించారు..
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలతో పాటూ సోషల్ మీడియాలోనూ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా ఉండే మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చిట్ చాట్‌లో భాగంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంలో మూడు పదవులు ఉన్నట్లు.. తమ కుటుంబం నుంచి మూడు పదవులు ఉండాలని అనుకున్నామని చెప్పారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమ కుమారుడు భద్రారెడ్డిని మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కేసీఆర్ ఆదేశిస్తే పోటీ చెయ్యడానికి తమ కొడకు సిద్ధమని స్పష్టం చేశారు. జగ్గారెడ్డి ఎంపీ టికెట్ కోసం రేవంత్ రెడ్డిని పొగుడుతున్నారని చెప్పారు. జగ్గారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా జగ్గారెడ్డి ఫోకస్ కావడం కోసమే తన పేరును వాడుకుంటున్నాడని, తన పేరు ఎత్తకపోతే ఆయన్ను ఎవరూ పట్టించుకోరని తెలిపారు. గతంలో రేవంత్ రెడ్డిని తిట్టిన మాటలు అందరికీ గుర్తే ఉన్నాయని గుర్తు చేశారు. చేవెళ్ల కాంగ్రెస్ టికెట్ కోసం రంజిత్ రెడ్డి కర్చీఫ్ వేసుకున్నారని, అది తెలిసి పట్నం మహేందర్ రెడ్డి అలెర్ట్ అయ్యారని చెప్పారు. చేవెళ్ల కాంగ్రెస్ టికెట్ కోసమే.. పట్నం మహేందర్ రెడ్డి రేవంత్ రెడ్డిని కలిశారన్నారు. తనకు గోవాలో హోటల్ ఉందని, రాజకీయాలు నుంచి తప్పుకొంటే గోవా వెళ్లి ఎంజాయ్ చేస్తానని చెప్పారు. మనిషికి జీవితం ఒకేసారి వస్తుందని, ఎంజాయ్ చేయాలంటూ మల్లారెడ్డి పేర్కొన్నారు.
CM Revanth Reddy: ప్రధాని మోదీ వద్దకు.. కేసీఆర్ వెళ్లింది అందుకే..