GHMC: జీహెచ్‌ఎంసీ ప్రజావాణిలో గందరగోళం...
ABN , Publish Date - Oct 08 , 2024 | 08:58 AM
జీహెచ్‌ఎంసీ(GHMC)లో ప్రజావాణి గాడి తప్పుతోంది. సమయానికి అధికారులు రాక.. ఫిర్యాదులు పరిష్కారం కాక పౌరులు మండిపడుతున్నారు. సోమవారం సంస్థ ప్రధాన కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి ప్రారంభం కాగా, ఒకరిద్దరు మినహా ఉన్నతాధికారులు అందుబాటులో లేరు.
- అందుబాటులో లేని అధికారులు
- పౌరుల ఆగ్రహం.. 12 తరువాత వచ్చిన కమిషనర్
హైదరాబాద్ సిటీ: జీహెచ్‌ఎంసీ(GHMC)లో ప్రజావాణి గాడి తప్పుతోంది. సమయానికి అధికారులు రాక.. ఫిర్యాదులు పరిష్కారం కాక పౌరులు మండిపడుతున్నారు. సోమవారం సంస్థ ప్రధాన కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి ప్రారంభం కాగా, ఒకరిద్దరు మినహా ఉన్నతాధికారులు అందుబాటులో లేరు. అప్పటికే పదుల సంఖ్యలో వచ్చిన పౌరులు.. అధికారులు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 గంటల వరకు కూడా కొన్ని విభాగాల అధిపతులు రాలేదు. దీంతో ఎవరికి తమ సమస్య చెప్పుకోవాలో అర్థం కాక అయోమయానికి గురయ్యారు.
ఈ వార్తను కూడా చదవండి: Dussehra: దసరాకు 6,304 ప్రత్యేక బస్సులు..
ప్రజావాణిలో గందరగోళ వాతావరణం నెలకొందని తెలుసుకున్న కమిషనర్ ఆమ్రపాలి మధ్యాహ్న 12 గంటల తరువాత హడావిడిగా విచ్చేశారు. పౌరులు ఆమె వద్ద అసహనం వ్యక్తం చేశారు. రెండు గంటల క్రితం వచ్చాం.. ఇప్పటివరకు వేచి చూడాలా..? అధికారులు అందుబాటులో లేకుంటే ఎలా అని కొందరు పేర్కొన్నారు. ఇప్పటికే ఐదారుసార్లు వచ్చాం.. ప్రతిసారి చూస్తాం.. చేస్తామంటున్నారు ఫిర్యాదులు పరిష్కారం కావడం లేదని ఇంకొందరు అధికారులతో వాగ్వాదానికి దిగారు. వారికి ఆమ్రపాలి సర్ధిచెప్పి విజ్ఞప్తులు స్వీకరించారు.
139 ఫిర్యాదులు..
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో భారీగా ఫిర్యాదులు వచ్చాయి. 90 మంది నేరుగా, తొమ్మిది మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అక్రమ నిర్మాణాలపై 22, రెండు పడకల ఇళ్లకు సంబంధించి 59, ఆస్తి పన్ను వివాదాలపై 5, ఐటీ, హెల్త్, జోనల్, సర్కిల్ కార్యాలయాలకు సంబంధించి సమస్యలపై ఒక్కో విజ్ఞప్తి వచ్చింది. జోనల్ కార్యాలయాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో మరో 49 ఫిర్యాదులు వచ్చాయి. కేంద్ర, జోనల్ కార్యాలయాల్లో జరిగిన ప్రజావాణిలో 139 ఫిర్యాదులు వచ్చినట్టు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది.
.................................................................
ఈ వార్తను కూడా చదవండి:
...................................................................
Hyderabad: ఎంఐఎం వర్సెస్ కాంగ్రెస్..
- విజయనగర్‌కాలనీలో ఘర్షణ
హైదరాబాద్: నాంపల్లి ఎమ్మెల్మే మాజిద్ హుస్సేన్(Nampally MLM Majid Hussain), కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్‌ఖాన్(Congress leader Feroze Khan) మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. వారి అనుచరులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. విజయనగర్‌కాలనీ డివిజన్ ఆసిఫ్ నగర్ పోలీస్‌స్టేషన్(Asif Nagar Police Station)కు కూతవేటు దూరంలో సీసీ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. పనులను పరిశీలించేందుకు వెళ్లిన ఫిరోజ్‌ఖాన్, స్థానిక ఎంఐఎం నాయకుల మధ్య ఘర్షణ ఏర్పడింది.
ఎంఐఎం నాయకులపై ఫిరోజ్‌ఖాన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అనుచరులతో కలిసి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ సంఘటనాస్థలానికి చేరుకున్నారు. దీంతో ఒకరిపై ఒకరు దూషించుకుంటూ దాడికి దిగారు. దీంతో ఆ ప్రాంతమంతా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాలూ రాళ్లు రువ్వుకున్నాయి. ఆసిఫ్ నగర్ ఇన్‌స్పెక్టర్ జి.వెంకటేశ్వర్లు ఇరువర్గాలను సముదాయించి అక్కడి నుంచి పంపించి వేశారు. దీనిపై ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. డీసీపీ చంద్రమోహన్ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు.
ఇదికూడా చదవండి: Harish Rao: జర్నలిస్టులకు సర్కారు దసరా కానుక ఇదేనా?
ఇదికూడా చదవండి: Hyderabad: త్వరలో టీడీపీలోకి తీగల
ఇదికూడా చదవండి: Police Department: అవినీతి ఐపీఎస్‌లపై కొరడా!
ఇదికూడా చదవండి: Gold Prices Today: గుడ్ న్యూస్.. దిగొచ్చిన పసిడి ధరలు..
Read Latest Telangana News and National News