Share News

Floods: నక్కలవాగులో ప్రభుత్వ ఉద్యోగి గల్లంతు

ABN , Publish Date - Sep 02 , 2024 | 03:51 AM

వర్షాల ధాటికి పొంగిప్రవహిస్తున్న వాగులో ప్రభుత్వ ఉద్యోగి ఒకరు గల్లంతయ్యాడు.

Floods: నక్కలవాగులో ప్రభుత్వ ఉద్యోగి గల్లంతు

కాల్వశ్రీరాంపూర్‌, సెప్టెంబరు 1: వర్షాల ధాటికి పొంగిప్రవహిస్తున్న వాగులో ప్రభుత్వ ఉద్యోగి ఒకరు గల్లంతయ్యాడు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలంలో జరిగిందీ ఘటన. కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన చెప్పాల పవన్‌(22) మీర్జంపేట గ్రామ పంచాయతీలో కారోబార్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం మీర్జంపేట గ్రామానికి వెళ్లి విధులు నిర్వహించి సాయంత్రం కాల్వశ్రీరాంపూర్‌కు మోటార్‌సైకిల్‌పై బయలుదేరాడు. అయితే, కొత్తపల్లి శివారు వద్ద.. రోడ్డుపైకి పొంగి ప్రవహిస్తున్న నక్కలవాగు ఉధృతికి ద్విచక్ర వాహనంతో సహా కొట్టుకుపోయాడు. పోలీసులు, కాల్వశ్రీరాంపూర్‌వాసులు పవన్‌ కోసం వాగులో గాలింపు చర్యలు చేపట్టారు.


  • 54 మందిని కాపాడిన ఎన్డీఆర్‌ఎఫ్‌

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో ఆకేరు నదికి వరద ఉధృతంగా రావడంతో ఆదివారం ఉదయాన్నే రాకాసి తండాను చుట్టుముట్టింది. గ్రామస్థుల్లో కొందరు సురక్షిత ప్రాంతాలకు వెళ్లగా.. 54 మంది డాబాలపైకి ఎక్కి సహాయం కోసం చూశారు. కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌, సీపీ సునీల్‌దత్‌.. అక్కడికి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపించి స్పీడ్‌బోట్లతో మొత్తం 54 మందినీ సురక్షితంగా తరలించారు.

Updated Date - Sep 02 , 2024 | 03:51 AM