Share News

Hyderabad: 3 వైద్య కాలేజీలకు రూ. 204 కోట్లు..

ABN , Publish Date - Jun 27 , 2024 | 03:12 AM

జూనియర్‌ డాక్టర్ల డిమాండ్ల నేపథ్యంలో రాష్ట్రంలో మూడు పాత మెడికల్‌ కాలేజీలకు రూ.204 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈమేరకు హెల్త్‌ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తూ బుధవారం ఉత్తర్వులిచ్చారు.

Hyderabad: 3 వైద్య కాలేజీలకు రూ. 204 కోట్లు..

  • ఉస్మానియా, గాంధీలో గర్ల్స్‌, మెన్స్‌ హాస్టళ్ల నిర్మాణం

  • జూడాల డిమాండ్ల నేపథ్యంలో జీవో జారీ

హైదరాబాద్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి) : జూనియర్‌ డాక్టర్ల డిమాండ్ల నేపథ్యంలో రాష్ట్రంలో మూడు పాత మెడికల్‌ కాలేజీలకు రూ.204 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈమేరకు హెల్త్‌ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తూ బుధవారం ఉత్తర్వులిచ్చారు. ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్‌ కాలేజీల్లో హాస్టళ్లు, రోడ్లు, ఇతర వసతులను సమకూర్చుకొనేందుకు ఈ నిధులు వినియోగించుకోవాలని సూచించారు. ఉస్మానియా మెడికల్‌ కాలేజీ లేడీస్‌ హాస్టల్‌కు రూ.80 కోట్లు, మెన్స్‌ హాస్టల్‌కు రూ.35 కోట్లు, డెంటల్‌ హాస్టల్‌కు రూ.6 కోట్లు, ప్రస్తుత పాత హాస్టల్‌ మరమ్మతులకు రూ. 50 లక్షలు, కృష్ణవేణి లేడీస్‌ హాస్టల్‌ సీసీ రోడ్లకు రూ. 40 లక్షలు, గాంధీ మెడికల్‌ కాలేజీ లేడీస్‌ హాస్టల్‌కు రూ.42 కోట్లు, మెన్స్‌ హాస్టళ్లకు రూ.23 కోట్లు, సీనియర్‌ రెసిడెంట్‌ల హాస్టల్‌ బ్లాక్‌ నిర్మాణానికి రూ.14.50 కోట్లు, కాకతీయ మెడికల్‌ కాలేజీలో సిమెంట్‌ కాంక్రీట్‌ రోడ్లకు రూ. 2.75 కోట్లు, జీఎస్టీ, ఇతర ఖర్చులకు రూ.70 లక్షల చొప్పున కేటాయించారు.


పదోన్నతులు కల్పించండి

- ల్యాబ్‌ టెక్నీషియన్ల ఆందోళన

ల్యాబ్‌ టెక్నీషియన్లకు పదోన్నతులు కల్పించాలని సెంట్రల్‌ అసోసియేషన్‌ యూనియన్‌ ఆందోళన చేపట్టింది. ఈమేరకు తెలంగాణ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు బుధవారం కోఠిలో హెల్త్‌ డైరెక్టర్‌ను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ల్యాబ్‌ టెక్నీషియన్స్‌ సెంట్రల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నిజాముద్దీన్‌ మాట్లాడుతూ.. ఎల్టీ గ్రేడ్‌ వన్‌ పదోన్నతుల జాప్యంతో గత 30 ఏళ్లుగా ఎల్టీ గ్రేడ్‌గా పనిచేస్తున్న ల్యాబ్‌ టెక్నీషియన్లు తీవ్రమైన మానసిక క్షోభను అనుభవిస్తున్నారన్నారు.

Updated Date - Jun 27 , 2024 | 03:12 AM