Share News

Government Notices: ‘అనర్హ’ లబ్ధిదారుల నుంచి రికవరీలు వద్దు

ABN , Publish Date - Jul 15 , 2024 | 03:13 AM

ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్లో అనర్హులుగా గుర్తించిన వారికి నోటీసులు జారీ చేయడం గానీ, వారు పొందిన మొత్తాన్ని రికవరీ చేయడం గానీ చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతి కుమారి సచివాలయంలోని ఆయా విభాగాలు, అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

Government Notices: ‘అనర్హ’ లబ్ధిదారుల నుంచి రికవరీలు వద్దు

  • అసెంబ్లీలో చర్చలయ్యాకే రికవరీకి మార్గదర్శకాలు

  • ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు సంబంధించి

  • కలెక్టర్లకు సీఎస్‌ శాంతికుమారి ఆదేశం

హైదరాబాద్‌, జూలై14 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్లో అనర్హులుగా గుర్తించిన వారికి నోటీసులు జారీ చేయడం గానీ, వారు పొందిన మొత్తాన్ని రికవరీ చేయడం గానీ చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతి కుమారి సచివాలయంలోని ఆయా విభాగాలు, అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. తదుపరి మార్గదర్శకాలు విడుదల చేసేవరకు సంక్షేమ పథకాల్లో అనర్హులపై ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని ఆదేశాల్లో స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలుచేస్తున్న పలు అభివృద్థి, సంక్షేమ పఽథకాలకు సంబందించి లబ్ధిదారుల్లో పలువురు అనర్హులున్నట్లు పలు మార్గాల ద్వారా తమ దృష్టికి వచ్చిందని వెల్లడించారు.


అన్ని పఽథకాలను పేదలు, అర్హులకే అందించాలన్న సీఎం రేవంత్‌ రెడ్డి సంకల్పం మేరకు ఈ పథకాల అమలు తీరును క్రమబద్ధీకరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో.. ఆయా పథకాల అమల్లో గుర్తించిన అవకతవకలపై చర్చించి తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని, ఆ తర్వాతే రికవరీచేసే విధానాలపై ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేస్తుందని పేర్కొన్నారు.

Updated Date - Jul 15 , 2024 | 03:13 AM