Share News

Government Transfers: సహకార శాఖలో అక్రమ బదిలీలు

ABN , Publish Date - Aug 23 , 2024 | 03:09 AM

ప్రభుత్వం సాధారణ బదిలీలపై తిరిగి నిషేధం విధించిన తర్వాత కూడా సహకార శాఖలో పాత తేదీలతో బదిలీలు కొనసాగిస్తున్నారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వాపోతున్నారు.

Government Transfers: సహకార శాఖలో అక్రమ బదిలీలు

  • మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసులకే ప్రాధాన్యం!

హైదరాబాద్‌, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం సాధారణ బదిలీలపై తిరిగి నిషేధం విధించిన తర్వాత కూడా సహకార శాఖలో పాత తేదీలతో బదిలీలు కొనసాగిస్తున్నారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వాపోతున్నారు. రాష్ట్రంలో గత నెల 20న ప్రభుత్వం బదిలీలపై నిషేధం విధించింది. రుణమాఫీ నేపథ్యంలో వ్యవసాయ, సహకార శాఖలకు మాత్రం ఈ నెల 20 వరకు అవకాశం కల్పించింది. దాంతో 366 మంది జోనల్‌, మల్టీ జోనల్‌ పోస్టుల్లో ఉద్యోగులకు బదిలీలు అయ్యాయి.


20తో గడువు ముగిసినా.. ఆ తర్వాత 21న ఐదుగురు స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ రిజిస్ట్రార్లు, 17 మంది జాయింట్‌ రిజిస్ట్రార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారని ఉద్యోగులు పేర్కొంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసులనే పరిగణనలోకి తీసుకున్న అధికారులు నిబంధనల ప్రకారం బదిలీలు చేయలేదని, దీంతో చాలామంది ఉద్యోగులకు అన్యాయం జరిగిందని చెబుతున్నారు. గడువు ముగిసిన రెండు రోజుల తర్వాత పాత తేదీలతో ఉత్తర్వులు ఇచ్చి, తొలుత చేరి విధుల్లో ఉన్న వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారని వాపోతున్నారు.

Updated Date - Aug 23 , 2024 | 03:09 AM