Harish Rao Video: నీ పేరు ఏంది.. నాలుగేళ్ల తరువాత మళ్లీ వస్తాం చూస్కుందాం
ABN , Publish Date - Sep 12 , 2024 | 09:49 PM
"నీ పేరు ఏంది.. నాలుగేళ్ల తరువాత మళ్లీ వస్తాం చూస్కుందాం" ఇది అన్నది ఎవరో చోటామోటా నేత కాదు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యేనే. ఆయన ఎవరో కాదు తన్నీరు హరీశ్ రావు.
హైదరాబాద్: "నీ పేరు ఏంది.. నాలుగేళ్ల తరువాత మళ్లీ వస్తాం చూస్కుందాం" ఇది అన్నది ఎవరో చోటామోటా నేత కాదు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యేనే. ఆయన ఎవరో కాదు తన్నీరు హరీశ్ రావు. ఓ పోలీసుకు ఇచ్చిన వార్నింగే ఇది. ప్రస్తుతం హరీశ్ రావు వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సవాళ్ల పర్వం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒకరిపై ఒకరు దూషించుకోవడం.. పరస్పరం దాడులు చేసుకోవడానికి దారి తీసింది. ఇవాళ మధ్యాహ్నం అరికెపూడి గాంధీని అరెస్ట్ చేసిన పోలీసులు కాసేపటికి విడుదల చేశారు. దీంతో అరికెపూడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు సీపీ కార్యాలయానికి వెళ్లారు.
తమకు న్యాయం చేసే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని వారు అక్కడే కూర్చున్నారు. అనంతరం హరీశ్ రావు సహా మిగతా బీఆర్ఎస్ నేతలందరినీ పోలీసులు అరెస్ట్ చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిని తరలిస్తున్న క్రమంలో ఓ పోలీసుతో హరీశ్‌రావుకు స్వల్ప వాగ్వాదం జరిగింది. దీంతో ఆయన మాస్ వార్నింగ్ ఇచ్చారు. మరో నాలుగేళ్ల తరువాత బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వస్తుందని.. అప్పుడు చూస్కుందాం అని హెచ్చరించడం గమనార్హం.