Share News

Harish Rao: గురుపూజోత్సవానికి హాజరయ్యే తీరిక లేదా?

ABN , Publish Date - Sep 06 , 2024 | 04:09 AM

ప్రభుత్వం నిర్వహించిన గురుపూజోత్సవానికి హాజరయ్యే తీరిక సీఎంకు లేదా ? అంటూ బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌ రావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ప్రశ్నించారు.

Harish Rao: గురుపూజోత్సవానికి హాజరయ్యే తీరిక లేదా?

  • సీఎం రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్న

  • ఖమ్మం వరద బాధితులకు 3 లారీల్లో నిత్యావసరాలు పంపిన బీఆర్‌ఎస్‌ నేత

హైదరాబాద్‌, సిద్దిపేట టౌన్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రెండు, మూడు రోజుల్లో మహబూబాబాద్‌ జిల్లాకు కూడా సాయం అందిస్తామని చెప్పారు. ఖమ్మం వరద బాధితులకు సాయం చేసేందుకు వెళుతుండగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రోద్భలంతోనే తమపై దాడులు జరిగాయని హరీశ్‌ ఈ సందర్భంగా ఆరోపించారు. వరద బాధితులకు సకాలంలో సహాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని మండిపడ్డారు. ప్రభుత్వం ముందే మేల్కోని ఉంటే ప్రాణ నష్టం తగ్గేదన్నారు.


వరద ముంపు వల్ల నీట మునగిన ఇళ్ల వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారమివ్వాలని డిమాండ్‌ చేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు బీజేపీ కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే, అధికారం చేపడితే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకం కింద రూ.లక్ష తోపాటు తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైందని కాంగ్రెస్‌ పార్టీని హరీశ్‌ రావు ప్రశ్నించారు.

Updated Date - Sep 06 , 2024 | 04:09 AM