Share News

Phone Tapping Case: భుజంగరావు బెయిల్‌పై తీర్పు వాయిదా

ABN , Publish Date - Dec 27 , 2024 | 05:02 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇప్పటికే మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్న ఏ-3 ఎన్‌.భుజంగరావు దాఖలు చేసిన రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు గురువారం తీర్పు రిజర్వు చేసింది.

Phone Tapping Case: భుజంగరావు బెయిల్‌పై తీర్పు వాయిదా

హైదరాబాద్‌, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇప్పటికే మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్న ఏ-3 ఎన్‌.భుజంగరావు దాఖలు చేసిన రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు గురువారం తీర్పు రిజర్వు చేసింది. ఆయన దాఖలు చేసిన రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై జస్టిస్‌ కే. సుజన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పల్లె నాగేశ్వర్‌రావు వాదనలు వినిపిస్తూ బెయిల్‌ పిటిషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. అనారోగ్య కారణాలు సాకుగా చూపి, జైల్లో లొంగిపోకుండా నాలుగున్నర నెలలుగా నిందితుడు బయట ఉంటున్నారని ఆరోపించారు.


పిటిషనర్‌ తరఫున న్యాయవాది వాదిస్తూ ఆయన గుండె, నరాలు, ఎముకులకు సంబంధిత అనేక వ్యాధులతో ఇబ్బందిపడుతున్నారని పేర్కొన్నారు. దర్యాప్తు పూర్తికాకముందే ఛార్జిషీట్‌ను దిగువ కోర్టు స్వీకరించడం చెల్లదని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం తీర్పు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

Updated Date - Dec 27 , 2024 | 05:02 AM