Share News

Red Alert: తెలంగాణలో 15 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌..

ABN , Publish Date - Sep 03 , 2024 | 05:21 AM

రాష్ట్రంలో వరుసగా రెండో రోజు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 173 మండలాల్లో భారీ వర్షాలు కురిశాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది..

Red Alert: తెలంగాణలో 15 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌..

  • నేడు ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు..?

హైదరాబాద్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వరుసగా రెండో రోజు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 173 మండలాల్లో భారీ వర్షాలు కురిశాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మూడు మండలాల్లో 20 సెం.మీ.కు పైగా వర్షం కురవగా.. 35 మండలాల్లో 11-20 సెం.మీ., 135 మండలాల్లో 6-11 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. తెలంగాణలో మంగళవారం కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.


భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, ములుగు, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, నిర్మల్‌, సంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఇక బుధవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. మరోవైపు 5 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని వాతావరణ విభాగం పేర్కొంది.

Updated Date - Sep 03 , 2024 | 08:58 AM