Rains: విస్తరించిన రుతుపవనాలు.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
ABN , Publish Date - Jun 13 , 2024 | 09:05 AM
నైరుతి రుతుపవనాలు బుధవారం తెలంగాణ మొత్తం, చత్తీస్గఢ్‌లోని పలు ప్రాంతాలకు విస్తరించాయి. రానున్న మూడు రోజుల్లో ఉత్తరాంధ్రలో మిగిలిన ప్రాంతాలకు విస్తరించనున్నాయి.
హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు బుధవారం తెలంగాణ మొత్తం, చత్తీస్గఢ్‌లోని పలు ప్రాంతాలకు విస్తరించాయి. రానున్న మూడు రోజుల్లో ఉత్తరాంధ్రలో మిగిలిన ప్రాంతాలకు విస్తరించనున్నాయి.
కాగా ఉత్తరాంధ్ర మీదుగా తూర్పు పడమర మధ్య ద్రోణి సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది. దీంతో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల బుధవారం వర్షాలు(Heavy Rains) కురిశాయి.
రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది.
ఏపీలోని విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, గుంటూరు, బాపట్లతోపాటు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు, లోతట్టుప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.