Share News

High Court: చట్టప్రకారం మోడల్‌ స్కూల్‌ టీచర్ల బదిలీలు చేపట్టండి : హైకోర్టు

ABN , Publish Date - Sep 13 , 2024 | 05:07 AM

చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం మోడల్‌ స్కూల్స్‌లో పనిచేస్తున్న టీచర్ల బదిలీలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

High Court: చట్టప్రకారం మోడల్‌ స్కూల్‌ టీచర్ల బదిలీలు చేపట్టండి  : హైకోర్టు

హైదరాబాద్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం మోడల్‌ స్కూల్స్‌లో పనిచేస్తున్న టీచర్ల బదిలీలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇందుకు తుది సీనియారిటీ జాబితా రూపొందించాలని, అర్హత పాయింట్లను కేటాయించాలని స్పష్టం చేసింది. గతేడాది జూలై 3న పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ జారీ చేసిన మార్గదర్శకాలు 2018లో ప్రభుత్వం ఇచ్చిన జీవో 81కు విరుద్థంగా ఉన్నాయంటూ జనగాం జిల్లా ఘన్‌పూర్‌ మోడల్‌ స్కూల్‌కు చెందిన 15 మంది ఉపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.


దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ నగేశ్‌ భీమపాక ధర్మాసనం.. తెలంగాణ మోడల్‌ స్కూల్స్‌ టీచర్స్‌ మార్గదర్శకాల మేరకు బదిలీలు చేపట్టాలని పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌, మోడల్‌ స్కూల్స్‌ అడిషనల్‌ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - Sep 13 , 2024 | 05:07 AM