Share News

HMDA EX Director: రూ.100 కోట్లకు పైగా హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ ఆస్తులు.. అరెస్ట్ చేసిన ఏసీబీ

ABN , Publish Date - Jan 25 , 2024 | 08:29 AM

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమంగా భారీగా ఆస్తులను సంపాదించారు. హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో రూ.100 కోట్ల పైగా కూడబెట్టారు. అక్రమ ఆస్తులు కూడబెట్టిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

 HMDA EX Director: రూ.100 కోట్లకు పైగా హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ ఆస్తులు.. అరెస్ట్ చేసిన ఏసీబీ

హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమంగా భారీగా ఆస్తులను సంపాదించారు. హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో రూ.100 కోట్ల పైగా కూడబెట్టారు. బుధవారం ఉదయం నుంచి ఏసీబీ 20 బృందాలుగా విడిపోయి 17 చోట్ల సోదాలు నిర్వహించింది. శివ బాలకృష్ణ ఇళ్లు, కార్యాలయాలు, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ఈ రోజు సాయంత్రం వరకు సోదాలు కొనసాగుతాయని ఏసీబీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు రూ.100 కోట్లకు పైగా స్థిర, చరాస్తులు ఉన్నాయని ఏసీబీ అధికారులు వివరించారు. అక్రమ ఆస్తులు కూడబెట్టిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన మెట్రో రైల్ ప్లానింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. రెరా కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు.

ఇంట్లో క్యాష్ కౌంటింగ్ మిషన్

శివ బాలకృష్ణ మరో నాలుగు లాకర్లను ఈ రోజు తెరుస్తామని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. అందులో మరిన్ని ఆస్తుల పత్రాలు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. పలువురు రాజకీయ నేతలు, ఉన్నతాధికారుల అండతో శివ బాలకృష్ణ అక్రమ ఆస్తులు సంపాదించారని తెలుస్తోంది. శివ బాలకృష్ణ ఇంట్లో నిన్న రూ. 40 లక్షల నగదు, రెండు కిలోల బంగారాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 60 కాస్ట్లీ వాచీలు, 14 మొబైల్స్, 10 ల్యాప్ టాప్స్ సీజ్ చేశారు. బాలకృష్ణ నివాసంలో క్యాష్ కౌంటింగ్ యంత్రాలను కూడా గుర్తించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 25 , 2024 | 08:29 AM