Share News

Hyderabad: 10 కిలోల బంగారు బిస్కెట్లు.. ‘వాల్మీకి’ అవినీతి కేసులో నిందితుడి నుంచి స్వాధీనం

ABN , Publish Date - Jul 28 , 2024 | 10:08 AM

వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్‌ అవినీతి కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు హైదరాబాద్‌(Hyderabad)లో ఓ నిందితుడి ఇంట్లో 10 కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad: 10 కిలోల బంగారు బిస్కెట్లు.. ‘వాల్మీకి’ అవినీతి కేసులో నిందితుడి నుంచి స్వాధీనం

- నగరంలో ఫ్లాట్లు కొనుగోలు చేసినట్లు గుర్తింపు

బెంగళూరు: వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్‌ అవినీతి కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు హైదరాబాద్‌(Hyderabad)లో ఓ నిందితుడి ఇంట్లో 10 కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు కూడా విచారిస్తున్నారు. అవినీతి సొమ్ముతో నిందితుడు కొనుగోలు చేసినట్లు భావిస్తున్న బంగారాన్ని గురువారం రాత్రి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్‌(Hyderabad)లో ఫస్ట్‌ ఫైనాన్స్‌ క్రెడిట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ చైర్మన్‌ సత్యనారాయణ వర్మను అరెస్టు చేసి కస్టడీకి తీసుకున్నారు. బ్యాంకు ఖాతా ద్వారా వచ్చిన సొమ్ముతో 35 కిలోల బంగారాన్ని ఆయన కొనుగోలు చేసినట్లు తెలిసింది.


అందులో 20 కిలోల బంగారాన్ని అవినీతిలో భాగస్వామ్యులైన వారికి పంచిపెట్టానని, 15 కిలోల బంగారం ఇంకా తన ఫ్లాట్‌లోనే ఉన్నట్లు విచారణలో వెల్లడించారు. దీంతో సిట్‌ అధికారులు అతడి ఫ్లాట్‌లో సోదా చేసి 10 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో 5 కిలోల కోసం సోదా చేస్తున్నారు.


ఫ్లాట్లు కొనుగోలు

సత్యనారాయణవర్మ, అతడి సహచరులు వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్‌(Valmiki Development Corporation) ఖాతాల నుంచి నగదు బదిలీ చేయించుకుని హైదరాబాద్‌లో ఫ్లాట్లు కొనుగోలు చేసినట్లు గుర్తించి వాటి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. వర్మకు సంబంధించిన ఒక ఫ్లాట్‌లో గతంలో దాడి చేసినప్పుడు రూ.1.82 కోట్ల నగదు, నోట్ల లెక్కింపు మెషీన్లను స్వాధీనం చేసుకున్నారు. సదరు కో-ఆపరేటివ్‌ బ్యాంకుకు చెందిన 18 ఖాతాలకు వాల్మీకి కార్పొరేషన్‌ నుంచి రూ.94.73 కోట్లు జమ చేశారు. ఆ తర్వాత 270కు పైగా నకిలీ ఖాతాలను తెరిచి నగదు బదిలీ చేశారు.


ఇదికూడా చదవండి: Godavari: భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 28 , 2024 | 10:08 AM