Hyderabad: ఆధార్.. ఇయ్యట్లే
ABN , Publish Date - Nov 13 , 2024 | 12:39 PM
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఆస్తులు, బ్యాంకుల వివరాలే కాదు.. ఆధార్‌కార్డు (Aadhar card)నంబర్ ఇచ్చేందుకు కూడా పౌరులు ఆసక్తి చూపించడం లేదు. చాలావరకు వివరాలు గోప్యంగా ఉంచుతున్నారని.. ఆధార్ ఇస్తే ఆస్తులు, ఇతర వివరాలు ప్రభుత్వానికి తెలుస్తాయన్న ఉద్దేశంతో పలువురు ముందుజాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.
- సంక్షేమ పథకాల కోసం నంబర్ ఇవ్వాలంటున్న ఎన్యూమరేటర్లు
- గ్రేటర్‌లో డేటా ఎంట్రీకి ఏజెన్సీ ఎంపిక
- నంబర్ చెప్పేందుకు పలువురి విముఖత
హైదరాబాద్ సిటీ: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఆస్తులు, బ్యాంకుల వివరాలే కాదు.. ఆధార్‌కార్డు (Aadhar card)నంబర్ ఇచ్చేందుకు కూడా పౌరులు ఆసక్తి చూపించడం లేదు. చాలావరకు వివరాలు గోప్యంగా ఉంచుతున్నారని.. ఆధార్ ఇస్తే ఆస్తులు, ఇతర వివరాలు ప్రభుత్వానికి తెలుస్తాయన్న ఉద్దేశంతో పలువురు ముందుజాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: జలమండలి నయా ఆలోచన.. మ్యాన్‌హోల్ వ్యర్థాల నుంచి ‘ఇసుక’
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్(Jubilee Hills, Banjara Hills) వంటి ప్రాంతాల్లో మెజార్టీ కుటుంబాలు ఆధార్ నంబర్ ఇవ్వడం లేదని.. విద్యావంతులు, ఉద్యోగులు, వ్యాపారులు తదితర వర్గాలకు చెందిన కొందరు మాత్రమే కుటుంబసభ్యుల పేర్లు, కులం, వృత్తి, వైవాహిక స్థితి వంటి వివరాలు మాత్రమే చెబుతున్నారు. ఇప్పటికే రేషన్‌కార్డులు ఉన్న, పక్కా గృహాలు, పింఛన్లు, ఇతరత్రా సంక్షేమ పథకాలు పొందుతున్న వారూ.. ఆధార్ నంబర్ చెబితే ఆయా పథకాలు నిలిపివేస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు.
ఆధార్ నంబర్ ఇస్తేనే సంక్షేమ పథకాలు పొందే అవకాశముంటుందని ఎన్యూమరేటర్లు చెబుతుండడంతో.. కొత్తగా సంక్షేమం కోరుకునే, ఇప్పటికే లబ్ధిదారులుగా ఉండి ఎలాంటి ఇబ్బంది ఉండదనుకునే వారు మాత్రం వివరాలు ఇస్తున్నారు. ఆధార్ వివరాలు అడగవద్దన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో దరఖాస్తులోనూ ఆధార్‌ను ఐచ్ఛికం (ఆప్షన్)గా పేర్కొన్నారు. అయితే శిక్షణలో భాగంగా ఆధార్ నంబర్ తీసుకునే ప్రయత్నం చేయాలని మాస్టర్ ట్రైనర్లు సూచించడంతో సంక్షేమ పథకాలు పొందాలంటే ఆధార్ వివరాలు ఇవ్వాలని కోరుతున్నారు.
డేటా ఎంట్రీకి ఏజెన్సీ
సర్వే దరఖాస్తుల డేటా ఎంట్రీకి జీహెచ్‌ఎంసీ ఏజెన్సీని ఎంపిక చేసింది. సర్కిళ్ల వారీగా ఎక్కడికక్కడ వివరాలు కంప్యూటర్‌లో పొందుపర్చనున్నారు. నేడు లేదా రేపు డేటా ఎంట్రీ మొదలవుతుందని ఓ అధికారి తెలిపారు. దరఖాస్తులను భద్రపర్చేందుకు ప్రత్యేకంగా ట్రంక్ బాక్సులను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. డేటా ఎంట్రీ అనంతరం కూడా ఇదే బాక్సుల్లో దరఖాస్తులను ఎన్యూమరేషన్ బ్లాకుల వారీగా ఉంచే బాధ్యతలు సర్కిళ్ల వారీగా ఒక్కో అధికారికి అప్పగించారు. నింపిన, డేటా ఎంట్రీ చేసిన దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు అందాయి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నత్తనడకన సర్వే
గ్రేటర్‌లో సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే నత్తనడకన సాగుతోంది. ఇప్పటివరకు 2,98,374 కుటుంబాల వివరాలు సేకరించినట్లు జీహెచ్‌ఎంసీ మంగళవారం ప్రకటించింది. మరో 26.50 లక్షల కుటుంబాల సమాచారం తీసుకోవాల్సి ఉంది. కోడ్ ఆధారంగా నింపుతుండడంతో ఒక్కో దరఖాస్తుకు 40 నిమిషాలకుపైగా పడుతోందని ఓ ఎన్యూమరేటర్ తెలిపారు. పర్యవేక్షణ, నోడల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే తీరును పరిశీలిస్తున్నారు. సోమవారం 1.58 లక్షల కుటుంబాల వివరాలు సేకరించగా.. మంగళవారం 1.40 లక్షల కుటుంబాల వివరాలు మాత్రమే సేకరించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో సర్వేకు హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. బంజారాహిల్స్‌లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు.
ఈవార్తను కూడా చదవండి: ‘లగచర్ల' దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాం
ఈవార్తను కూడా చదవండి: హనుమకొండ ఆస్పత్రిలో ఎలుకల స్వైరవిహారం
ఈవార్తను కూడా చదవండి: ఫిలింనగర్‌లో యువతి ఆత్మహత్య
ఈవార్తను కూడా చదవండి: ఇదేనా నీ పాలన.. రేవంత్‌పై హరీష్ కామెంట్స్
Read Latest Telangana News and National News