Share News

Hyderabad: పబ్‌లు, కార్పొరేట్‌ కళాశాలలు, ఐటీ కంపెనీల్లో.. డ్రగ్స్‌ టెస్ట్‌లు

ABN , Publish Date - Aug 04 , 2024 | 08:42 AM

డ్రగ్స్‌ సరఫరా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్న నార్కోటిక్‌ బ్యూరో(Bureau of Narcotics) అధికారులు సరికొత్త కార్యక్రమానికి కార్యాచరణ రూపొందిస్తున్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ తరహాలోనే డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించేందుకు వారు సిద్ధమవుతున్నారు.

Hyderabad: పబ్‌లు, కార్పొరేట్‌ కళాశాలలు, ఐటీ కంపెనీల్లో.. డ్రగ్స్‌ టెస్ట్‌లు

- డ్రంకెన్‌ డ్రైవ్‌ తరహాలో ఆకస్మిక తనిఖీలు

- ప్రణాళికలు రూపొందిస్తున్న నార్కోటిక్‌ బ్యూరో

హైదరాబాద్‌ సిటీ: డ్రగ్స్‌ సరఫరా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్న నార్కోటిక్‌ బ్యూరో(Bureau of Narcotics) అధికారులు సరికొత్త కార్యక్రమానికి కార్యాచరణ రూపొందిస్తున్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ తరహాలోనే డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించేందుకు వారు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా కార్పొరేట్‌ కాలేజీల విద్యార్థులు, ఐటీ కంపెనీ ఉద్యోగులు మత్తు బారిన పడుతున్నట్లు గుర్తించారు. దీంతో పబ్‌లు, క్లబ్‌లు, కళాశాలలు, కార్పొరేట్‌ స్కూల్స్‌(Corporate Schools), ఈవెంట్స్‌ జరుగుతున్న ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేయనున్నారు. ఆ ప్రదేశాన్ని సమూహంగా తీసుకొని ర్యాండమ్‌గా డ్రగ్స్‌ పరీక్షలు(Drug tests) నిర్వహించనున్నారు.

ఇదికూడా చదవండి: ED Raids: హీరా గ్రూప్‌ సంస్థల్లో ఈడీ సోదాలు


గంజాయి తీసుకున్న వారిలో 4 వారాలు, డ్రగ్స్‌ తీసుకున్న వారిలో 3 నెలలపాటు మత్తు ఆనవాళ్లు ఉంటాయి. పరీక్షలో వచ్చిన ఫలితాన్ని బట్టి మాదక ద్రవ్యాలు తీసుకున్న వారిని గుర్తించి విచారిస్తారు. డ్రగ్స్‌ ఎవరు సరఫరా చేశారు ? ఎక్కడ కొన్నారు ? ఎంతమందితో కలిసి సేవిస్తున్నారు ? తదితర వివరాలను రాబడుతారు. వారిచ్చిన సమాచారంతో డ్రగ్స్‌ స్మగ్లర్ల లింకులను పట్టుకోనున్నారు. గ్రేటర్‌వ్యాప్తంగా విస్తృతస్థాయి తనిఖీలు, పరీక్షలు నిర్వహిస్తే కొద్దిరోజుల్లోనే డ్రగ్స్‌ మహమ్మారి నుంచి యువతను దూరం చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.


డ్రగ్స్‌ ఫ్రీ నగరమే లక్ష్యం

డ్రగ్స్‌ బారిన పడుతున్న యువత వాటికి బానిసలుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఏదో మార్గం ద్వారా నగరానికి డ్రగ్స్‌ సరఫరా అవుతుండడంతో ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. డ్రగ్స్‌ ఫ్రీ నగరమే లక్ష్యంగా తెలంగాణ నార్కోటిక్‌ బ్యూరో అధికారులు లోకల్‌ స్మగ్లర్లతోపాటు అంతర్రాష్ట్ర ఘరానా స్మగ్లర్ల ఆటకట్టిస్తున్నారు. అందులో భాగంగా డ్రంకెన్‌ డ్రైవ్‌ తరహాలోనే డ్రగ్స్‌ టెస్టులను చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు.


ఇదికూడా చదవండి: నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు

ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Updated Date - Aug 04 , 2024 | 08:42 AM