Hyderabad: కాంగ్రెస్ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం..
ABN , Publish Date - Apr 30 , 2024 | 11:04 AM
మాదిగలకు టిక్కెట్ల కేటాయింపులో అన్యాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి లోక్‌సభ ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపిస్తామని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు(Motkupalli Narsimhulu) అన్నారు. కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన అన్నారు.
- మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు
హైదరాబాద్: మాదిగలకు టిక్కెట్ల కేటాయింపులో అన్యాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి లోక్‌సభ ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపిస్తామని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు(Motkupalli Narsimhulu) అన్నారు. కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 80 లక్షల మంది మాదిగలు రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయబోతున్నారని ఆయన హెచ్చరించారు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎంఆర్‌పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga)తో కలిసి మాట్లాడారు. ఎంపీ సీట్ల కేటాయింపులో రెడ్డి, మాలలకే ప్రాధాన్యత ఇచ్చారని, మాదిగ జాతిని విస్మరించారని,
ఇదికూడా చదవండి: Hyderabad: తొలగించినవి తక్కువ.. చేర్చినవి ఎక్కువ!
ఈ కుట్రలో సీఎం రేవంత్‌రెడ్డిది ప్రధాన పాత్ర అని ఆరోపించారు. ఎంఆర్‌పీఎస్(MRPS) అధినేత మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ మాదిగల అణచివేతకు నిరసనగా మే4న ఇందిరాపార్కు లేదా అంబేడ్కర్ విగ్రహం వద్ద మాదిగల సామూహిక దీక్ష, ధర్నా నిర్వహిస్తామని, మే 5 నుంచి రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాదిగ ఆత్మగౌరవ పరిరక్షణ యాత్రలు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్‌నరేష్ మాదిగ, జాతీయ నాయకులు ఎడవెల్లి యాదయ్యమాదిగ, ఎంఎ్‌సఎఫ్ ఇన్‌చార్జి నర్సింహులు మాదిగ పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి: JP Nadda: వికసిత్ భారత్ కోసమే ఈ ఎన్నికల..
Read Latest Telangana News And Telugu News
Read Latest Telangana News And Telugu News