Hyderabad: ఉప్పల్ భగాయత్‌లో అక్రమ నిర్మాణం సీజ్
ABN , Publish Date - Dec 18 , 2024 | 07:04 AM
ఉప్పల్ భగాయత్(Uppal Bhagayat)లో ఖాళీ స్థలాలకు రక్షణ కరువైంది. లేఅవుట్‌లో ప్రజా అవసరాల కోసం వదిలిపెట్టిన స్థలాలను కొందరు కబ్జా చేస్తున్నారు. వాటిలో నిర్మించిన ఓ అక్రమ కట్టడాన్ని మంగళవారం జీహెచ్‌ఎంసీ(GHMC) అధికారులు సీజ్ చేశారు.
హైదరాబాద్: ఉప్పల్ భగాయత్(Uppal Bhagayat)లో ఖాళీ స్థలాలకు రక్షణ కరువైంది. లేఅవుట్‌లో ప్రజా అవసరాల కోసం వదిలిపెట్టిన స్థలాలను కొందరు కబ్జా చేస్తున్నారు. వాటిలో నిర్మించిన ఓ అక్రమ కట్టడాన్ని మంగళవారం జీహెచ్‌ఎంసీ(GHMC) అధికారులు సీజ్ చేశారు. ఆరు నెలల క్రితం కొందరు కబ్జాదారులు షెడ్లను వేసుకోగా అధికారులు కూల్చివేశారు. తాజాగా మళ్లీ కొందరు అక్రమ నిర్మాణాలను చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఇక చాలు.. ఆపండి.. బోర్డుకు విధేయత చూపండి
స్థానిక కార్పొరేటర్ మందుముల రజితా పరమేశ్వర్‌రెడ్డి జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన ఉప్పల్ సర్కిల్ డీసీ ఆంజనేయులు(Uppal Circle DC Anjaneyulu) మంగళవారం హెచ్‌ఎండీఏ భగాయత్ లేఅవుట్‌లోని ఖాళీ స్థలంలో వెలిసిన షెడ్‌ను గుర్తించి వెంటనే సీజ్ చేశారు. కోలకతాకు చెందిన దేవతామూర్తుల విగ్రహాలు తయారు చేసే వ్యాపారులు కొందరు ఆ స్థలాన్ని కబ్జా చేసి ఏకంగా అతిపెద్ద షెడ్‌ను నిర్మించారు.
దీని వెనుక ఎవరైనా నాయకుల ప్రమేయం ఉండి ఉంటుందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. షెడ్ నిర్మించిన వ్యాపారులను ప్రశ్నిస్తే తాము స్థలం ఖాళీగా ఉందని తాత్కాలిక షెడ్ నిర్మించుకొని విగ్రహాలు తయారు చేస్తున్నామని, ఎవరికి ఏమీ ఇవ్వలేదని చెబుతున్నట్లు ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు వెల్లడించారు. అయితే కొందరు కిందిస్థాయి సిబ్బంది కబ్జాదారులతో లోపాయికారిగా ఒప్పందం కుదుర్చుకొని అక్రమ షెడ్ల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్నారనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఈవార్తను కూడా చదవండి: Youth Addiction : మృత్యు వలయం
ఈవార్తను కూడా చదవండి: బీఆర్ఎస్ నేతలకు సవాల్, చర్చకు సిద్ధమా..
ఈవార్తను కూడా చదవండి: నాలుగు నెలల క్రితమే అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థి.. చివరకు
ఈవార్తను కూడా చదవండి: లగచర్ల రైతులపై కేసులు ఎత్తివేయాలి
Read Latest Telangana News and National News