Hyderabad: మాజీమంత్రి కేటీఆర్‌పై కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు..
ABN , Publish Date - Oct 04 , 2024 | 11:29 AM
సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), కాంగ్రెస్ అధిష్ఠానంపైన తప్పుడు ఆరోపణలు చేసిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR)పై తగిన చర్యలు తీసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ కన్వీనర్ తోటకూర శ్రీకాంత్ గురువారం కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), కాంగ్రెస్ అధిష్ఠానంపైన తప్పుడు ఆరోపణలు చేసిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR)పై తగిన చర్యలు తీసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ కన్వీనర్ తోటకూర శ్రీకాంత్ గురువారం కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్ జి.అంజయ్యను కలిసిన ఆయన ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. మూసీ ప్రక్షాళన కోసం రూ.లక్షా యాబైవేల కోట్ల నిధులు కేటాయించారని, అందులో రూ.25వేల కోట్లు ఢిల్లీ పెద్దలకు దోచి పెట్టేందుకు మూసీ ప్రక్షాళన ప్రక్రియ చేపట్టారని కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేసినట్లు శ్రీకాంత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేటీఆర్‌పై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఇదికూడా చదవండి: M Revanth Reddy : తెలంగాణ ఏర్పడ్డాక క్రీడలను నిర్లక్ష్యం చేశారు
.......................................................
ఈ వార్తను కూడా చదవండి:
.....................................................
Hyderabad: హైడ్రా పేరిట పేదల నివాసాలను కూల్చవద్దు
- సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ
హైదరాబాద్: హైడ్రా(Hydra) పేరిట పేదల నివాసాలను కూల్చవద్దని, భూకబ్జాల నుంచి చెరువులు, కుంటలను కాపాడాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ(CPI ML New Democracy) రాష్ట్ర పార్టీ నేతలు డిమాండ్ చేశారు. గురువారం విద్యానగర్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ సహాయ కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు, నాయకులు కె. గోవర్థన్, పీఓడబ్ల్యూ కన్వీనర్ సంధ్య, ఐఎఫ్‌టీయూ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, అధ్యక్షురాలు అనురాధ మాట్లాడారు.
హైదరాబాద్ నగరాన్ని కబ్జాల నుంచి రక్షించడానికి రూపొందించిన హైడ్రాను నిరుపేదలు, బస్తీవాసులపై ప్రయోగించి వారికి నివాసాలు, జీవనోపాధి లేకుండా చేసే విధానాలను నిలిపివేయాలన్నారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రూ. 2 లక్షల వరకు వెంటనే రుణమాఫీ చేయాలని, రామగుండం రాడార్ కేంద్రం ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో పీడీఎస్‌యూ ప్రదాన కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి: నేను మాట్లాడింది తప్పే.. కానీ అతడిని తెలంగాణలో తిరగనీయం
ఇదికూడా చదవండి: మంత్రి సురేఖ వ్యాఖ్యలు.. ప్రభాస్, రామ్ చరణ్, రాజమౌళి ఏమన్నారంటే
ఇదికూడా చదవండి: సూర్యాపేట కలెక్టరేట్‌లో లైంగిక వేధింపులు !
ఇదికూడా చదవండి: Etela Rajender : దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా రా!
Read Latest Telangana News and National News