Share News

Cyber ​​crime: నగర వాసికి.. సైబర్ క్రైమ్ పేరుతో భారీ టోకరా..

ABN , Publish Date - Apr 25 , 2024 | 05:11 PM

రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సైబర్ నేరాగాళ్ల ఉచ్చులో చిచ్చుకునే ప్రమాదం ఉంది. తాజాగా, నగర వాసికి ముంబై సైబర్ క్రైమ్ పోలీసుల పేరుతో నేరగాళ్లు టోకరా వేశారు..

Cyber ​​crime: నగర వాసికి.. సైబర్ క్రైమ్ పేరుతో భారీ టోకరా..

హైదరాబాద్: రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సైబర్ నేరాగాళ్ల ఉచ్చులో చిచ్చుకునే ప్రమాదం ఉంది. తాజాగా, నగర వాసికి ముంబై సైబర్ క్రైమ్ (MUMBAI CYBER CRIME) పోలీసుల పేరుతో నేరగాళ్లు టోకరా వేశారు. నగరరంలో ఉంటున్న ఓ వ్యక్తికి ఇటీవల ఓ ఫోన్ కాల్ వచ్చింది. ముంబై సైబర్ క్రైమ్ పోలీసులమంటూ తమని తాము పరిచయం చేసుకున్నారు. మీ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ద్వారా డ్రగ్స్ (Drugs) ఇతరత్రా అసాంఘిక కార్యకలాపాలకు నగదు చెల్లింపులు నడిచాయని, దీనిపై విచారణ చేస్తున్నామని.. ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న నగదు మొత్తం ట్రాన్స్ఫర్ చేసి క్లోజ్ చేయాలని బెదిరించారు.


ముంబై సైబర్ క్రైమ్ పోలీసులమని చెప్పడంతో సదరు వ్యక్తి.. ఇదంగా నిజమేనని భయపడిపోయాడు. వరుస ఫోన్ కాల్స్ చేసి పదే పదే బెదిరిస్తుండడంతో.. కేసు నుంచి బయటపడాలనే ఉద్దేశంతో వారు చెప్పినట్లు చేశాడు. ఈ క్రమంలో కేటుగాళ్లు.. సదరు వ్యక్తి నుంచి మొత్తం రూ.50లక్షలను బ్యాంక్ ఖతాకు బదిలీ చేయించుకున్నారు. అయితే తర్వాత తనకు వచ్చిన ఫోన్లన్నీ ఫేక్ కాల్స్ అని తెలియడంతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు. కాగా, ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Apr 25 , 2024 | 05:11 PM