Share News

Wife: చెల్లెలికి టీవీ కొనిచ్చాడని.. భార్య స్కెచ్.. చివరకు ఎవరూ ఊహించని షాకింగ్ సీన్..

ABN , Publish Date - Apr 24 , 2024 | 04:06 PM

దంపతుల మధ్య తలెత్తే కొడవలు కొన్నిసార్లు చిలికిచిలికి గాలివానలా మారుతుంటాయి. అయినా కొన్ని గంటల్లో, కొన్ని రోజుల్లో సమసిపోతుంటాయి. తర్వాత యథావిధిగా అన్యోన్యంగా జీవనం సాగిస్తుంటారు. అయితే కొన్నిసార్లు మాత్రం ఈ గొడవలు.. చాలా దూరం వెళ్తుంటాయి. చిన్న చిన్న విషయాలకూ..

Wife: చెల్లెలికి టీవీ కొనిచ్చాడని.. భార్య స్కెచ్.. చివరకు ఎవరూ ఊహించని షాకింగ్ సీన్..
ప్రతీకాత్మక చిత్రం

దంపతుల మధ్య తలెత్తే గొడవలు కొన్నిసార్లు చిలికిచిలికి గాలివానలా మారుతుంటాయి. అయినా కొన్ని గంటల్లో, కొన్ని రోజుల్లో సమసిపోతుంటాయి. తర్వాత యథావిధిగా అన్యోన్యంగా జీవనం సాగిస్తుంటారు. అయితే కొన్నిసార్లు మాత్రం ఈ గొడవలు.. చాలా దూరం వెళ్తుంటాయి. చిన్న చిన్న విషయాలకూ.. భర్తలు, మరికొన్నిసార్లు భార్యలు తీసుకునే షాకింగ్ నిర్ణయాలు.. చివరకు వారి సంసారాన్ని సైతం సర్వ నాశనం చేస్తుంటాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన చెల్లెలికి టీవీ, ఉంగరం కొనిచ్చాడు. ఈ విషయం అతడి భార్యకు తెలిసి గొడవ పెట్టుకుంది. చివరకు ఏం జరిగిందంటే..


ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) బారాబంకి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన చంద్ర ప్రకాష్ (35) అనే వ్యక్తి.. తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇదిలావుండగా, చంద్ర ప్రకాష్ సోదరికి వివాహం నిశ్చయమైంది. ఏప్రిల్ 26న వివాహం జరగాల్సి ఉంది. దీంతో చెల్లెలి పెళ్లికి ఏదైనా గుర్తుగా వస్తువు ఇవ్వాలని అనుకున్నాడు. చివరికి తన చెల్లెలికి బంగారు ఉంగరం కొనివ్వడంతో పాటూ ఖరీదైన టీవీ కూడా కొనిచ్చాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ఈ విషయం భార్యకు తెలియగానే కోపంతో ఊగిపోయింది. భర్త ఇంటికి రాగానే ఉంగరం, టీవీ విషయంపై గొడవపెట్టుకుంది. ‘‘నా చెల్లెలికి కొనిస్తే తప్పేముందీ’’.. అంటూ చంద్ర ప్రకాష్ కూడా భార్యపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఆమె కోపం మరింత పెరిగింది.

Viral Video: వాసన చూసి గడ్డిలో వెతుక్కుంటూ వెళ్లిన పులి.. చివరకు ఎలా షాక్ ఇచ్చిందో చూడండి..

crime.jpg

దంపతుల వాగ్వాదం కాస్తా.. చివరకు (Quarrel between couple) గొడవగా మారింది. భర్తపై ఆగ్రహం వ్యక్తం చేసిన భార్య.. అంతటితో ఆగకుండా తన సోదరులకు విషయం చెప్పి పిలిపించింది. ఆమెకు సర్దిచెప్పి గొడవ లేకుండా చేయాల్సిన సోదరులు.. అందుకు విరుద్ధంగా బావపై గొడవకు దిగారు. గొడవ పడడమే కాకుండా కర్రలతో చంద్రప్రకాష్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన చుట్టు పక్కల వారు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతను చికత్స పొందుతూ మ‌ృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారించారు. మృతుడి భార్యతో సహా ఆమె ఐగుగురు సోదరులపై కేసులు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Optical illusion: మీ చూపు పవర్‌ఫుల్ అయితే.. ఈ చిత్రంలో దాక్కున్న కీటకాన్ని 30 సెకన్లలో కనిపెట్టండి చూద్దాం..

Updated Date - Apr 24 , 2024 | 04:11 PM