Hyderabad: నగరంలో నిషేధాజ్ఞల సడలింపు
ABN , Publish Date - Nov 12 , 2024 | 07:59 AM
కొన్ని రోజులుగా నగరంలో అమలవుతున్న నిషేధాజ్ఞలను సడలిస్తూ సోమవారం సీపీ సీవీ ఆనంద్(CP CV Anand) ఆదేశాలు జారీ చేశారు. సచివాలయ పరిసరాల్లో బీఎన్‌ఎ్‌స 163 సెక్షన్ (గతంలో 144 సెక్షన్) అమలులో ఉంటుందన్నారు.
- సచివాలయ పరిధిలో మాత్రమే ఆంక్షలు
- నిరసన ప్రదర్శనలకు పోలీసుల అనుమతి తప్పనిసరి
- ఆదేశాలు జారీ చేసిన సీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్ సిటీ: కొన్ని రోజులుగా నగరంలో అమలవుతున్న నిషేధాజ్ఞలను సడలిస్తూ సోమవారం సీపీ సీవీ ఆనంద్(CP CV Anand) ఆదేశాలు జారీ చేశారు. సచివాలయ పరిసరాల్లో బీఎన్‌ఎ్‌స 163 సెక్షన్ (గతంలో 144 సెక్షన్) అమలులో ఉంటుందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అక్టోబరు 28న సిటీ కమిషనరేట్(City Commissionerate) పరిధిలో ధర్నాలు, రాస్తారోకోలు, బంద్‌లపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఔర్ ఏక్‌బార్.. మరోమారు నూతన టీచర్ల సర్టిఫికెట్ల పరిశీలన
నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో ఈ ఆంక్షలను సవరిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ధర్నా చౌక్(Dharna Chowk)లో శాంతియుతంగా నిరసనలు, ధర్నాలు చేసుకోవచ్చన్నారు. నిరసనలు, ర్యాలీలకు పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా, నిబంధనలు ఉల్లంఘించి సభలు, సమావేశాలు నిర్వహించినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు... ఏం జరిగిందంటే..
ఈవార్తను కూడా చదవండి: IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య
ఈవార్తను కూడా చదవండి: TG News: పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత సుజాత...
ఈవార్తను కూడా చదవండి: Khammam: బోనకల్‌లో యాచకుడికి ఐపీ నోటీసు
Read Latest Telangana News and National News