Share News

Hyderabad: మూడు సంవత్సరాల తర్వాత ఆర్టీసీ బస్సు పునఃప్రారంభం..

ABN , Publish Date - Jun 18 , 2024 | 11:02 AM

మన్సూరాబాద్‌లోని కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు ఆర్టీసీ బస్సును పునఃప్రారంభించడం హర్షణీయమని కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. మన్సూరాబాద్‌(Mansurabad) డివిజన్‌లోని ప్రెస్‌ కాలనీ, సౌంత్‌ ఎండ్‌ పార్క్‌, సెవెన్‌ హిల్స్‌కాలనీ, డిపినగర్‌, చండీశ్వర్‌కాలనీలకు గతంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలు కొనసాగాయి.

Hyderabad: మూడు సంవత్సరాల తర్వాత ఆర్టీసీ బస్సు పునఃప్రారంభం..

- హర్షం వ్యక్తం చేసిన కాలనీవాసులు

హైదరాబాద్: మన్సూరాబాద్‌లోని కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు ఆర్టీసీ బస్సును పునఃప్రారంభించడం హర్షణీయమని కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. మన్సూరాబాద్‌(Mansurabad) డివిజన్‌లోని ప్రెస్‌ కాలనీ, సౌంత్‌ ఎండ్‌ పార్క్‌, సెవెన్‌ హిల్స్‌కాలనీ, డిపినగర్‌, చండీశ్వర్‌కాలనీలకు గతంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలు కొనసాగాయి. కాగా మన్సూరాబాద్‌లోని ప్రధాన రహదారుల పక్కన వాహనాల పార్కింగ్‌, కూరగాయల సంతలు ఏర్పాటు చేయడంతో ఆర్టీసీ బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని ఆర్టీసీ బస్సులు రాకపోకలు నిలిపివేశారు. దీంతో కాలనీవాసులు, ఉద్యోగులు, విద్యార్థులు మూడేళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ బస్సులు తిరిగి పునరుద్ధరించాలని కాలనీవాసులు బండ్లగూడ(Bandlaguda) ఆర్టీసీ డిపో మేనేజర్‌ ఎన్‌.రమే్‌షకు విజ్ఞప్తి చేశారు. కాలనీల ప్రధాన రహదారులపై వాహనాల పార్కింగ్‌, కూరగాయాల సంతలు ఏర్పాటు చేస్తే చలాన్లు విధించాలని కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.

ఇదికూడా చదవండి: BRS: బీఆర్‌ఎస్‏కు బిగ్ షాక్... మరో కీలక నేత గుడ్‌బై..!


city5.jpg

దీంతో కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. దీంతో కాలనీవాసులు మూడేళ్ల అనంతరం తమ కాలనీలకు ఆర్టీసీ బస్సులు పునఃప్రారంభం కావడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులు తిరిగి ప్రారంభించడానికి కృషి చేసిన కార్పొరేటర్‌, మున్సిపల్‌ అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులు, ఆర్టీసీ యాజమాన్యానికి కాలనీవాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాలనీవాసులు నాగార్జున, లింగారెడ్డి, విజయపాల్‌రెడ్డి, రాంబాబు, మూర్తి, విజయ, రాములు, పోలెపల్లి చంద్రారెడ్డి, కత్తుల రాంబాబు, అరుణ్‌కుమార్‌, ఎం.యాదగిరియాదవ్‌, నరేందర్‌రెడ్డి, కిషన్‌, శంకర్‌గౌడ్‌, వెంకటేశ్‌ పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 18 , 2024 | 11:02 AM