Share News

Hyderabad: ఒమన్ లో చిక్కుకున్న మహిళ.. కాపాడాలంటూ మంత్రి జై శంకర్ కు లేఖ

ABN , Publish Date - Jan 05 , 2024 | 03:01 PM

ఉపాధి కోసం హైదరాబాద్ నుంచి అరబ్ దేశాలకు ఎంతో మంది వలస వెళ్తుంటారు. అక్కడ కాయాకష్టం చేసుకుని

Hyderabad: ఒమన్ లో చిక్కుకున్న మహిళ.. కాపాడాలంటూ మంత్రి జై శంకర్ కు లేఖ

ఉపాధి కోసం హైదరాబాద్ నుంచి అరబ్ దేశాలకు ఎంతో మంది వలస వెళ్తుంటారు. అక్కడ కాయాకష్టం చేసుకుని కుటుంబాన్ని పోషించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. చిత్రహింసలు, దాడులు, అత్యాచారాలు, చోరీలు, కిడ్నాపింగ్, దోపిడీల మధ్య నిత్యం బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతుంటారు. దేశం కాని దేశంలో విపత్కర పరిస్థితుల మధ్య జీవిస్తుంటారు. తాజాగా.. హైదరాబాద్‌కు చెందిన ఫరీదా బేగం అనే మహిళ ఒమన్‌లోని మస్కట్‌లో చిక్కుకుపోయింది. విషయం తెలుసుకున్న ఆమె చెల్లెలు ఫహ్మీదా బేగం తన సోదరి ఫరీదాను తిరిగి ఇండియాకు తీసుకురావాలని కోరుతూ విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌కి లేఖ రాశారు.

హైదరాబాద్‌లోని గోల్కొండ జమాలి కుంటలో నివాసం ఉంటున్న ఫరీదా బేగం.. తన కుటుంబ ఆర్థిక ఆర్థిక పరిస్థితి సరిగా లేదు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న సమయంలో ఆమెకు ఓ ఏజెంట్ పరిచయమయ్యాడు. ఫుడ్, వసతితో పాటు నెలకు 1400 దిర్హమ్ ల జాబ్ ఆఫర్‌తో ఒక ఏజెంట్ ఆమెను సంప్రదించాడు. పని నచ్చకపోతే ఇండియాకు రావచ్చని హామీ ఇచ్చాడు. అతని మాటలు నమ్మిన ఫరీదా బేగం నవంబర్ 2023న దుబాయ్‌ వెళ్లింది.


పని మనిషిగా నెల రోజులు చేసిన తర్వాత ఫరీదా బేగం అనారోగ్యానికి గురైంది. ఇండియాకు తిరిగి వచ్చేయాలని నిర్ణయించింది. ఈ విషయం ఏజెంట్ కు చెబితే.. ఆమె ఇండియాకు రావడానికి అతను ఒప్పుకోలేదు. అంతే కాకుండా పాస్‌పోర్ట్‌ ఇచ్చేందుకూ నిరాకరించాడు. విషయం తెలుసుకున్న ఆమె చెల్లెలు.. ఫహ్మీదా బేగం తన సోదరిని రక్షించాలని కోరుతూ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ కు లేఖ రాశారు. తన సోదరిని ఇండియాకు తీసుకురావాలని కన్నీటిపర్యంతమయ్యారు.

"మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి"

Updated Date - Jan 05 , 2024 | 03:06 PM