ACB: శివబాలకృష్ణ కేసులో కీలక పరిణామం.. సినిమా ఎండింగ్‌కు వచ్చినట్టేనా..?
ABN , Publish Date - Feb 13 , 2024 | 02:39 PM
Telangana: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి శివ బాలకృష్ణ బినామీలకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. బీనామీలుగా ఉన్న భరత్, సత్యనారాయణ, భరణికి నోటీసులు జారీ అయ్యాయి.
హైదరాబాద్, ఫిబ్రవరి 13: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ (Former Director of HMDA Siva Balakrishna) కేసులో ఏసీబీ (ACB) దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి శివ బాలకృష్ణ బినామీలకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. బీనామీలుగా ఉన్న భరత్, సత్యనారాయణ, భరణికి నోటీసులు జారీ అయ్యాయి. మరింత లోతుగా విచారించేందుకు విచారణ హాజరుకావాలని వారికి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. దర్యాప్తులో లభించిన ఆధారాలు, సోదాల్లో దొరికిన పత్రాల ఆధారంగా విచారణ జరుగనుంది. ఏసీబీ కస్టడీలో శివ బాలకృష్ణ వెల్లడించిన ఐఏఎస్ అధికారి విషయంలోనూ చర్యలకు ఏసీబీ అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వ అనుమతితో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. శివ బాలకృష్ణ ఆస్తులన్నీ కుటుంబ సభ్యుల పేరిట ఉన్నట్లు గుర్తించారు. 2021 నుండి 2023లోనే కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు రిజిస్ట్రేషన్లు జరిగినట్లు విచారణలో బయటపడింది. యాదాద్రి జిల్లాలో శివ బాలకృష్ణకు 57 ఎకరాల భూమిపై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...