ACB: బాబోయ్.. శివబాలకృష్ణ ఆస్తుల లెక్కలు చూశారో..!!
ABN , Publish Date - Jan 25 , 2024 | 05:05 PM
Telangana: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హెచ్‌ఎండీ మాజీ డైరెక్టర్, రేరా కార్యదర్శి శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న (బుధవారం) బాలకృష్ణ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు భారీగా నగదు, విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్, జనవరి 25: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హెచ్‌ఎండీ మాజీ డైరెక్టర్, రేరా కార్యదర్శి శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న (బుధవారం) బాలకృష్ణ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు భారీగా నగదు, విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో బాలకృష్ణ ఇంట్లో పట్టుబడ్డ ఆస్తుల వివరాలను ఏసీబీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈరోజు (గురువారం) ఏబీసీ అధికారులు మీడియాతో మాట్లాడుతూ... బాలకృష్ణ ఆస్తులకు సంబంధించి వివరాలను తెలియజేశారు.
బాలకృష్ణ ఇంటితో పాటు 16 ప్రదేశాల్లో సోదాలు చేశామని తెలిపారు. నిందితుడు బాలకృష్ణపై 13 (1) (బీ) , 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. బాలకృష్ణ ఇంటితో పాటు, బంధువులు, సహచురుల ఇళ్లల్లో సోదాలు చేశామన్నారు. బాలకృష్ణ ఇంట్లో రూ. 99.60 లక్షలు నగదు సీజ్ చేశామమని.. బంగారం 1988 గ్రాములు, సిల్వర్ 6 కేజీలు సీజ్ చేసినట్లు చెప్పారు. 8.26 కోట్లు రూపాయలు విలువైన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. సీజ్ చేసిన ఆస్తుల విలువ మార్కెట్ వ్యాల్యూలో ఇంకా ఎక్కువ ఉంటుందని తెలిపారు. మిగిలిన బీనామీలపై విచారణ చేయాల్సి ఉందని ఏసీబీ అధికారులు వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...