Share News

Lavanya: ఆర్జే శేఖర్ బాషాపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో నటి లావణ్య ఫిర్యాదు..

ABN , Publish Date - Aug 04 , 2024 | 08:23 AM

టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్- లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ..

Lavanya: ఆర్జే శేఖర్ బాషాపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో నటి లావణ్య ఫిర్యాదు..

హైదరాబాద్: టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్- లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఆర్జే శేఖర్ బాషా తనపై దాడి చేశారంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో నటి లావణ్య ఫిర్యాదు చేశారు. తనపై పదే పదే శేఖర్ బాషా ఆరోపణలు చేస్తుండడంతో ప్రశ్నించేందుకు వెళ్లగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఆఫీసులో దాడి చేశారంటూ ఆరోపించింది. తనను చూడగానే విచక్షణ రహితంగా కొట్టాడని, కడుపుపై తన్నాడని ఆమె చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు నటి లావణ్య చెప్పుకొచ్చారు.


హీరో రాజ్ తరుణ్ తనను శారీరకంగా వాడుకుని మోసం చేశాడంటూ లావణ్య జులై 5న నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వారి వివాదంలోకి ఆర్జే శేఖర్ బాషా ఎంట్రీ ఇచ్చారు. దీంతో కథ కొత్తమలుపు తిరిగింది. మస్తాన్ సాయి అనే వ్యక్తితో లావణ్యకు శారీరక సంబంధం ఉందని, అలాగే ఆమెకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని సంచలన ఆరోపణలు చేశారు. అమాయకులైన యువతులకు సైతం ఆమె మత్తుపదార్థాలు అలవాటు చేసిందని సంచలన విషయాలు వెల్లడించారు.


దీనిపై ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌లో లావణ్య, శేఖర్ బాషా మధ్య చర్చ జరిగింది. ఇంటర్వ్యూలో శేఖర్ బాషా ఆమెపై తీవ్ర ఆరోపణలు చేస్తుండగా ఆగ్రహానికి గురైన లావణ్య ఒక్కసారిగా అతడిపై చెప్పుతో దాడి చేసింది. దీంతో "రా.. దమ్ముంటే కొట్టు" అంటూ శేఖర్ బాషా గట్టిగా అరిచారు. ఈ ఘటనతో ఇంటర్వ్యూ వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. వీరి గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.


అయితే తాజాగా శేఖర్ బాషాపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో లావణ్య ఫిర్యాదు చేశారు. మరో ఇంటర్వ్యూలో తనపై ఆరోపణలు చేస్తుండగా అడ్డుకునేందుకు ఓ యూట్యూబ్ ఛానెల్ ఆఫీస్‌కు వెళ్లినట్లు ఆమె చెప్పారు. తనను చూడగానే ఆర్జే శేఖర్ బాషా విచక్షణ రహితంగా దాడి చేశాడని ఆరోపించింది. కడుపుపై తన్ని తీవ్రంగా గాయపరిచాడని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే డయల్ 100కి సమాచారం ఇచ్చానని, పోలీసులు వచ్చి తనను ఆస్పత్రికి తరలించినట్లు ఆమె చెప్పారు. తనపై తీవ్ర ఆరోపణలు చేస్తూ దాడి చేసిన శేఖర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు నటి లావణ్య వెల్లడించారు.

ఈ వార్త కూడా చదవండి:

Crime News: హైదరాబాద్‌లో చిన్నారి కిడ్నాప్.. ఆటోలో ఎక్కించుకుపోయిన అగంతకుడు

Updated Date - Aug 04 , 2024 | 08:51 AM