Share News

Jani Master: జానీ మాస్టర్‌కు మరో షాక్..

ABN , Publish Date - Oct 07 , 2024 | 08:00 AM

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Choreographer Jani Master) తన అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయన బెయిల్ రద్దుపై కోర్టుకు పోలీసులు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Jani Master: జానీ మాస్టర్‌కు మరో షాక్..

హైదరాబాద్: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Choreographer Jani Master)తన అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయన బెయిల్ రద్దుపై కోర్టుకు పోలీసులు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసు నేపథ్యంలో జానీ మాస్టర్ కి జాతీయ అవార్డును నిలిపివేశారు. అంతకుముందు రంగారెడ్డి కోర్టు ఆయనకు అవార్డు తీసుకోవడానికి 4 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ అవార్డు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో జానీమాస్టర్ బెయిల్ ను రద్దు చేయాలంటూ పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. దీంతో ఆయనను మళ్లీ రిమాండ్‎కు తరలించే అవకాశాలు ఉన్నాయి.


గోవాలో అదుపులోకి ..

కాగా.. అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కుంటున్న జానీ మాస్టర్‌‌ను గత నెలలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గోవాలో జానీ మాస్టర్‌ను రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవా స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్‌ తీసుకుని హైదరాబాద్‌‌కు తరలించారు. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ ఉప్పర్‌పల్లిలోని 13వ అదనపు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ముందు హాజరుపరిచారు. పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలించి, ఇరువర్గా ల వాదనలూ విన్న న్యాయమూర్తి.. అక్టోబరు 3వ తేదీ వరకు (14 రోజుల) రిమాండ్‌ విధించారు. దీంతో ప్రస్తుతం చంచల్‌గూడ్ జైలులో ఉన్నారు. అలాగే జానీ మాస్టర్‌ను కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలవగా.. నాలుగు రోజుల పాటు కస్టడీ విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పునిచ్చింది.


ఫిల్మ్ ఛాంబర్‌‎లో సుమలత ఫిర్యాదు

జానీమాస్టర్‌ను నాలుగు రోజుల పాటు నార్సింగ్ పోలీసులు విచారించారు. పోలీసుల కస్టడీలో బాధితురాలే తనను వేధింపులకు గురిచేసిందంటూ జానీ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ అంశానికి సంబంధించి జానీ మాస్టర్ భార్య సుమలత ఫిల్మ్ ఛాంబర్‌కు ఫిర్యాదు చేసింది. ఐదు సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో తనకు చూపించిందని.. ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు తీసుకెళ్లిందని పేర్కొంది. తన భర్త జానీపై లేని పోనీ ఆరోపణలు చేసిన మహిళా కోరియోగ్రాఫర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు నేపథ్యంలో సుమలత నుంచి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వివరణ కోరింది. దీంతో వివరణ ఇచ్చేందుకు నిన్న (బుధవారం) ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ ముందు సుమలత హాజరయ్యారు. మహిళా కొరియోగ్రాఫర్‌కు సంబంధించిన అన్ని ఆధారాలను ఫిల్మ్ ఛాంబర్ కమిటీకి జానీ మాస్టర్ భార్య అందించారు. సుమలత దగ్గర నుంచి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ సభ్యులు వివరాలు సేకరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Revanth Reddy: ఎవరు అడ్డొచ్చినా ఆగదు..

Kishan Reddy: గోవా రైలుకు పచ్చజెండా

Hanumakonda: పిడుగుపాటుకు ఇద్దరి మృతి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 07 , 2024 | 09:00 AM