Kavitha: కవిత కేసులో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ఈడీ..!
ABN , Publish Date - Mar 16 , 2024 | 06:47 PM
ED Notices To Kavitha Husband: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి.! శుక్రవారం నాడు సోదాలు అని చెప్పి ఈడీ, ఐటీ రంగంలోకి దిగడం.. సడన్‌గా అరెస్ట్ చేయడం.. రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా ఈడీ (ED) కస్టడీకి ఇవ్వడం.. ఈ వరుస షాకులతో సతమతమవుతున్న కవితకు మరో ట్విస్ట్ ఇచ్చింది ఈడీ..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి.! శుక్రవారం నాడు సోదాలు అని చెప్పి ఈడీ, ఐటీ రంగంలోకి దిగడం.. సడన్‌గా అరెస్ట్ చేయడం.. రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా ఈడీ (ED) కస్టడీకి ఇవ్వడం.. ఈ వరుస షాకులతో సతమతమవుతున్న కవితకు మరో ట్విస్ట్ ఇచ్చింది ఈడీ. కవిత భర్త అనిల్ (Kavitha Husband Anil), కవిత పీఆర్వో రాజేష్‌తో సహా మరో ముగ్గురికి ఈడీ నోటీసులు జారీ చేసింది. సోమవారం నాడు వీరంతా విచారణకు హాజరు కావాల్సిందేనని నోటీసుల్లో ఈడీ ఆదేశించింది. ఇప్పటికే ఈ ఐదుగురికి సంబంధించిన ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. విచారణకు వెళ్తే పరిస్థితేంటి..? అని నోటీసులు అందుకున్న కవిత భర్త కంగారుపడుతున్నట్లుగా తెలుస్తోంది.
Big Breaking: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
అరెస్ట్ చేస్తారా..?
ఇప్పటికే కస్టడీ రిపోర్టులో.. లిక్కర్ స్కామ్‌లో ప్రధాన సూత్రధారుల్లో కవిత ఒకరని.. స్కామ్‌లో కవిత కుట్రదారు, లబ్ధిదారు అని ఈడీ తేల్చేసింది. దీంతో ఈ పరిస్థితుల్లో కవిత భర్త విచారణకు వెళ్తే ఎలా ఉంటుంది..? అని న్యాయ నిపుణులతో చర్చించే పనిలో ఉన్నారట. ఇప్పటికే ఫోన్లు సీజ్ చేసిన ఈడీ కీలక సమాచారమే సేకరించిందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు.. ఢిల్లీ వేదికగా చెల్లి కోసం న్యాయ పోరాటం చేసేందుకు మాజీ మంత్రి కేటీఆర్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం అనిల్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ టైమ్‌లోనే ఇలా కవిత భర్తకు నోటీసులు రావడంతో గులాబీ పార్టీలో గుబులు మొదలైంది. అనిల్‌ను వరుసగా రెండ్రోజులపాటు ఈడీ అధికారులు విచారణ చేస్తారని.. అరెస్ట్ కూడా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రచారం గట్టిగానే జరుగుతోంది.
Kavitha Arrest: కవిత రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు.. క్లియర్ కట్‌గా చెప్పేసిన ఈడీ!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి