Shiva Balakrishna: శివ బాలకృష్ణ కేస్లో మరో ట్విస్ట్
ABN , Publish Date - Feb 17 , 2024 | 10:48 AM
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేస్లో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. శివ బాలకృష్ణ కుటుంబ సభ్యులకు వ్యాపారాలు ఉన్నట్టు చూపించి ఫేక్ సంస్థలు ఏర్పాటు చేసి ఫేక్ ఐటి రిటర్న్స్ ఫైల్ చేసినట్టు గుర్తించారు. సౌందర్య బోటిక్, శారి వర్క్స్ పేరుతో ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు.
హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేస్లో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. శివ బాలకృష్ణ కుటుంబ సభ్యులకు వ్యాపారాలు ఉన్నట్టు చూపించి ఫేక్ సంస్థలు ఏర్పాటు చేసి ఫేక్ ఐటి రిటర్న్స్ ఫైల్ చేసినట్టు గుర్తించారు. సౌందర్య బోటిక్, శారి వర్క్స్ పేరుతో ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు. ఆర్ధిక ఆదాయాన్ని చూపేందుకు వీరి పేర్ల పై వ్యాపారాలు ఉన్నట్టు సృష్టించారు. ఈ షెల్ కంపెనీల ద్వారా కుటుంబ సభ్యుల పేరుతో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం జరిగింది. కూతురు పద్మావతికి కూడా ఆదాయం వస్తుందని శివ బాలకృష్ణ చూపించారు. హోమ్ ట్యూషన్స్ ద్వారా వచ్చిన అదాయంతో ఐటీ రిటర్న్ ఫైల్ చేసినట్టు సృష్టించారు. అక్రమ సంపాదనను కవర్ చేసేందుకు షెల్ కంపెనీల పేరుతో ఆదాయం వచ్చినట్టు శివ బాలకృష్ణ చూపించారు.