Share News

Hyderabad Pubs: అర్ధరాత్రి పబ్బులు, బార్‌లల్లో దాడులు.. డ్రగ్ టెస్ట్ చేయగా..

ABN , Publish Date - Aug 31 , 2024 | 10:49 AM

Telangana: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అర్ధరాత్రి పబ్బులు, బార్‌లల్లో పోలీసులు మరోసారి దాడులు నిర్వహించారు. టిజినాబ్, ఎక్సైజ్ సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, రంగారెడ్డిలోని 25 పబ్బులపై తనిఖీలు చేపట్టగా... పబ్బుల్లో అనుమానితులు 107 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు నిర్వహించారు. వారిలో ఐదుగురికి పాజిటివ్ అని తేలింది.

Hyderabad Pubs: అర్ధరాత్రి పబ్బులు, బార్‌లల్లో దాడులు.. డ్రగ్ టెస్ట్ చేయగా..
Pubs And Bars

హైదరాబాద్, ఆగస్టు 31: హైదరాబాద్ (Hyderabad), రంగారెడ్డి (Rangareddy) జిల్లాల్లో అర్ధరాత్రి పబ్బులు, బార్‌లల్లో పోలీసులు మరోసారి దాడులు నిర్వహించారు. టిజినాబ్, ఎక్సైజ్ సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, రంగారెడ్డిలోని 25 పబ్బులపై తనిఖీలు చేపట్టగా... పబ్బుల్లో అనుమానితులు 107 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు నిర్వహించారు. వారిలో ఐదుగురికి పాజిటివ్ అని తేలింది. రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట వరకు తనిఖీలు కొనసాగాయి.

AP News: చిత్తూరులో ప్రముఖ వ్యాపారి ఆత్మహత్య


ఎక్సోరాలో గంజాయి పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్ అని తేలింది. రంగరెడ్డి జిల్లాలోని బార్లలో తనిఖీలు నిర్వహించి... డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు చేయగా.. ముగ్గురు వ్యక్తులకు పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.


డ్రగ్స్‌ ఫ్రీ నగరమే లక్ష్యంగా...

కాగా... డ్రగ్స్‌ సరఫరా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్న నార్కోటిక్‌ బ్యూరో అధికారులు సరికొత్త కార్యక్రమానికి కార్యాచరణ రూపొందించిన విషయం తెలిసిందే. డ్రగ్స్‌ ఫ్రీ నగరమే లక్ష్యంగా తెలంగాణ నార్కోటిక్‌ బ్యూరో అధికారులు లోకల్‌ స్మగ్లర్లతో పాటు అంతర్రాష్ట్ర ఘరానా స్మగ్లర్ల ఆటకట్టించే పనిలో పడ్డారు. అందులో భాగంగా డ్రంకెన్‌ డ్రైవ్‌ తరహాలోనే డ్రగ్స్‌ టెస్టులను చేసేందుకు వారు సిద్ధమయ్యారు. ప్రధానంగా కార్పొరేట్‌ కాలేజీల విద్యార్థులు, ఐటీ కంపెనీ ఉద్యోగులు మత్తు బారిన పడుతున్నట్లు గుర్తించారు. దీంతో పబ్‌లు, క్లబ్‌లు, కళాశాలలు, కార్పొరేట్‌ స్కూల్స్‌, ఈవెంట్స్‌ జరుగుతున్న ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రదేశాన్ని సమూహంగా తీసుకొని ర్యాండమ్‌గా డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు.


గంజాయి తీసుకున్న వారిలో 4 వారాలు, డ్రగ్స్‌ తీసుకున్న వారిలో 3 నెలలపాటు మత్తు ఆనవాళ్లు ఉంటాయి. పరీక్షలో వచ్చిన ఫలితాన్ని బట్టి మాదక ద్రవ్యాలు తీసుకున్న వారిని గుర్తించి విచారస్తారు. డ్రగ్స్‌ ఎవరు సరఫరా చేశారు ? ఎక్కడ కొన్నారు ? ఎంతమందితో కలిసి సేవిస్తున్నారు ? తదితర వివరాలను రాబడుతారు. వారిచ్చిన సమాచారంతో డ్రగ్స్‌ స్మగ్లర్ల లింకులను పట్టుకోనున్నారు. గ్రేటర్‌వ్యాప్తంగా విస్తృతస్థాయి తనిఖీలు, పరీక్షలు నిర్వహిస్తే కొద్దిరోజుల్లోనే డ్రగ్స్‌ మహమ్మారి నుంచి యువతను దూరం చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

Chandrababu: 30 ఇయర్స్‌ బాబు!

Gudlavalleru College: హాస్టల్‌లో హిడెన్ కెమెరాల వెనుక కథ ఏంటి?

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 31 , 2024 | 11:40 AM