Share News

Raghunandanrao: బీఆర్‌ఎస్‌కు కార్యకర్తలు ఇప్పుడు గుర్తొచ్చారా?

ABN , Publish Date - Jan 23 , 2024 | 12:43 PM

Telangana: అధికారం కోల్పోయాక కార్యకర్తలు గుర్తొచ్చారా అంటూ బీఆర్‌ఎస్‌‌ను బీజేపీ నేత రఘునందనరావు ఎద్దేవా చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమకారులకు సీట్లు ఇస్తామంటోన్న కేటీఆర్.. మాటను నిలబెట్టుకోవాలన్నారు.

Raghunandanrao: బీఆర్‌ఎస్‌కు కార్యకర్తలు ఇప్పుడు గుర్తొచ్చారా?

హైదరాబాద్, జనవరి 23: అధికారం కోల్పోయాక కార్యకర్తలు గుర్తొచ్చారా అంటూ బీఆర్‌ఎస్‌‌ను బీజేపీ నేత రఘునందనరావు ఎద్దేవా చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమకారులకు సీట్లు ఇస్తామంటోన్న కేటీఆర్.. మాటను నిలబెట్టుకోవాలన్నారు. శంకరమ్మ విషయంలో తమరు ఇచ్చిన మాట గుర్తు లేదా? అని ప్రశ్నించారు. అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాసి అసలైన ఉద్యమకారులకు అవకాశం ఇస్తామని ప్రమాణం చేయాలన్నారు. మల్లన్న సాగర్, పోచమ్మసాగర్‌తో బీఆర్ఎస్ వందల కోట్లు దోచుకున్నారని ఆయన ఆరోపించారు.


త్యాగం చేసిన కుటుంబాలకు సీట్ల అవకాశం ఇస్తామని చెప్పే దమ్ము, దైర్యం బీఆర్ఎస్‌కు ఉందా? అని నిలదీశారు. పొత్తు కుదరదని మోదీ చెప్పిన రోజే.. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య తెగదెంపులు అయ్యాయన్నారు. తెలంగాణా సమాజం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టారన్నారు. ఎంఐఎంతో నిన్నటి వరకు పొత్తు పెట్టుకుంది బీఆర్ఎస్ అని.. అదే ఎంఐఎంతో ఇప్పుడు కాంగ్రెస్ దోస్తీ చేస్తుందన్నారు. అప్పనంగా ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడికి భూములు అప్పగించి అధ్యక్షుడిని చేశారన్నారు. కవితకు సీటు ఇస్తారా?.. ఇవ్వరా? అసలు కవిత బీఆర్ఎస్‌లో ఉందా లేదా? అని ప్రశ్నించారు. మొదట శంకరమ్మ, ఎర్రోళ్ల శ్రీనివాస్ లాంటి వాళ్లకు సీట్లు ఇవ్వాలని రఘునందనరావు హితవుపలికారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 23 , 2024 | 01:15 PM