Share News

Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలనం

ABN , Publish Date - Sep 26 , 2024 | 09:59 AM

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసాని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తిరుమల లడ్డూ పవిత్రత గురించి ఆయన మాట్లాడారు. తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన వారి తిరిగి అక్కడికి వెళ్లొద్దని స్పష్టం చేశారు.

Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలనం
BJP MLA Raja Singh

హైదరాబాద్: ఫైర్ బ్రాండ్, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ (Raja Singh) మరోసాని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తిరుమల లడ్డూ పవిత్రత గురించి ఆయన మాట్లాడారు. తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన వారి తిరిగి అక్కడికి వెళ్లొద్దని స్పష్టం చేశారు. వారు తిరుమల వెళితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తోందని హెచ్చరించారు. లడ్డూను అపవిత్రం చేసిన వారు తిరుమల వెళితే హిందువులు అంతా ఏకమై వారిని హతమారుస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. హిందువుల మనోభావాలు అందరూ గౌరవించాల్సిందేనని రాజా సింగ్ స్పష్టం చేశారు. ఇందులో సందేహానికి తావులేదని తేల్చి చెప్పారు. హిందువులను చులకన చేయడం, తప్పుగా మాట్లాడతారో వారికి ఇబ్బందులు తప్పవని తనదైన శైలిలో రాజా సింగ్ హెచ్చరించారు.


7.jpg


టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి.

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని రాజా సింగ్ సూచించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లడ్డూ నాణ్యతపై ఏపీ సర్కార్ సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సిట్‌తోపాటు టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని రాజా సింగ్ కోరారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆలయాలను పరిరక్షించాలని అభిప్రాయ పడ్డారు. అదేవిధంగా దేవదాయ ధర్మదాయ శాఖకు చెందిన భూములను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. లేదంటే అవి యథేచ్చగా ఆక్రమణకు గురి అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. హిందు సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని గుర్తుచేశారు.


3.jpg


అన్యమత ప్రచారం.. మత మార్పిడిలు

తెలుగు రాష్ట్రాల్లో అన్య మతస్తుల ప్రచారం గురించి రాజా సింగ్ గుర్తుచేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాల వద్ద అన్య మతస్తుల సంచారం ఆందోళన కలిగిస్తోందని వివరించారు. తిరుపతితోపాటు శ్రీశైలంలో అన్య మతస్తుల గురించి వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు. మత మార్పిడి చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మిగతా చోట్ల అన్య మతస్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. డబ్బులు, ఇతరత్రా ఇస్తామని చెప్పి హిందువుల మత మార్పిడి చేస్తున్నారని వివరించారు. మతం మారిన వారిలో బలహీన వర్గాలే ఎక్కువ మంది ఉన్నారని గుర్తుచేశారు.

ఇవి కూడా చదవండి:

AP Politics: వైసీపీకి ఎదురుదెబ్బ.. జనసేనలోకి బొత్స..

Viral News: వయస్సు 23.. పిల్లలు 24.. మహిళ సంచలన రికార్డు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Sep 26 , 2024 | 10:19 AM