BRS: ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల శిక్షణ తరగతులను బహిష్కరించిన బీఆర్ఎస్
ABN , Publish Date - Dec 11 , 2024 | 08:22 AM
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు శిక్షణాతరగతులు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ శిక్షణా తరగతులను బీఆర్ఎస్ బహిష్కరించింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల హక్కులకు స్పీకర్ భంగం కల్గించేలా వ్యవహరించారని కేటీఆర్ పేర్కొన్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు (MALs), శాసనమండలి (MLCs) సభ్యులకు శిక్షణాతరగతులు (Training classes) బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రోజు నుంచి జరగనున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల శిక్షణ తరగతులను బీఆర్ఎస్ బహిష్కరించింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల హక్కులకు స్పీకర్ భంగం కల్గించేలా వ్యవహరించారన్న కేటీఆర్ (KTR) తొలిరోజే తమ ఎమ్మెల్యేలను లోపలికి రాకుండా పోలీసులతో అరెస్టు చేయించారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా సమస్యలను ఎత్తిచూపేందుకు నిరసన తెలిపితే అరెస్టు చేశారని.. తమ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నారని బీఆర్ఎస్ విమర్శించింది. గత శాసనసభ సమావేశాల్లోనూ బీఆర్ఎస్ సభ్యుల గొంతు నోక్కేల వ్యవహరించారని బీఆర్ఎస్ ఆరోపించింది. ప్రతిపక్ష సభ్యలకు అవకామివ్వకుండా స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తన్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. బీఆర్ఎస్‌లో అతి కొద్దిమంది మాత్రమే కొత్త ఎమ్మెల్యేలున్నారని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్న స్పీకర్ వ్యవహార శైలికి నిరసనగా ఓరియంటేషన్ సెషన్‌ను బహిష్కరిస్తున్నామని బీఆర్ఎస్ పర్కొంది. ఇప్పటికైనా స్పీకర్ పార్టీలకు అతీతంగా వివక్ష లేకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేసింది.
కాగా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు శిక్షణాతరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుధ, గురువారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు ఇచ్చేందుకు ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేసింది. అయితే సభ్యలు ఎన్నికైన ఏడాది తర్వాత సడన్‌గా ఈ ట్రైనింగ్ క్లాసులను తెరపైకి తీసుకురావడం అన్నీ పార్టీల్లోచర్చనియంశంగా మారింది. ఈ ట్రైనింగ్ క్లాస్‌లకు వేరే కారణం ఉందని విశ్లేషణలు జరుగుతున్నాయి. అయితే అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు పెట్టినా... ఇలాంటి వాటికి కేవలం అధికారపార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తప్పా.. వేరే పార్టీల ఎమ్మెల్యేలు హాజరుకారు. అయితే దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకోవాలని హస్తం నేతలు భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం..
మోహన్ బాబు, మనోజ్, విష్ణులకు నోటీసులు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News