Share News

Delhi Liquor Case: ఆ విషయంలో కవితకు కాస్త ఊరట.. కోర్టు ఏం చెప్పిందంటే..?

ABN , Publish Date - May 06 , 2024 | 03:46 PM

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో (Delhi liquor scam case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. కాగా.. ట్రయల్ కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేరుగా హాజరుపరచాలంటూ కవిత దాఖలు చేసిన పిటీషన్‌ను కోర్టు అనుమతించినట్లు తెలుస్తోంది. రేపు(మంగళవారం) నేరుగా కోర్టు ముందుకు కవిత రానున్నట్లు సమాచారం.

Delhi Liquor Case: ఆ విషయంలో కవితకు కాస్త ఊరట.. కోర్టు ఏం చెప్పిందంటే..?
MLC Kavitha

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో (Delhi liquor scam case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. కాగా.. ట్రయల్ కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేరుగా హాజరుపరచాలంటూ కవిత దాఖలు చేసిన పిటీషన్‌ను కోర్టు అనుమతించినట్లు తెలుస్తోంది. రేపు(మంగళవారం) నేరుగా కోర్టు ముందుకు కవిత రానున్నట్లు సమాచారం. రేపు మధ్యాహ్నం 2 గంటలకు కవితను తీహార్ జైలు అధికారులు కోర్టు ముందు హాజరుపరుచనున్నారు. రేపటితో ఆమె జ్యుడీషియల్ కస్టడీ ముగియనున్నది. ఈ నేపథ్యంలో కోర్టు ఆమెను మళ్లీ ఈడీ కస్టడీకి ఇస్తుందా? లేక జ్యుడీషియల్ కస్టడీ విధిస్తుందా? లేక బెయిల్ మంజూరు చేస్తుందా? అనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు చుక్కెదురు

అయితే..ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈరోజు(సోమవారం) విచారించింది. ఆమె బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. ఈడీ, సీబీఐ కేసుల్లో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ రెండింటినీ కోర్టు కొట్టేసింది. దీంతో కవితకు మరో బిగ్ షాక్ తగిలినట్టయ్యింది.


Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసు.. కవిత బెయిల్‌పై నేడు తీర్పు

కాగా.. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చేయడానికి అధిష్ఠానం కవితను స్టార్ క్యాంపెయినర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని కోర్టుకు తెలియజేస్తూ.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని చెప్పినప్పటికీ రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. మరోవైపు.. మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్-45 ప్రకారం బెయిల్ అర్హత ఉందన్న విషయాన్ని పిటిషన్‌లో కవిత పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ఇదివరకే న్యాయస్థానం విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఇవాళ కవిత బెయిల్‌పై రౌస్ ఎవిన్యూ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా.. తిరస్కరిస్తూ తీర్పును వెలువరించారు.

Breaking: కవితకు మరో బిగ్ షాక్.. ఇప్పట్లో కష్టమే!

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 06 , 2024 | 03:48 PM