BRS: అసెంబ్లీకి ఆటోలలో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
ABN , Publish Date - Feb 09 , 2024 | 10:45 AM
హైదరాబాద్: ఆటోవాలాలకు న్యాయం చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫ్లకార్డులు పట్టుకుని అసెంబ్లీ వద్ద ధర్నా చేశారు. అనంతరం శాసనసభకు ఆటోలలో వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో వాలాలకు న్యాయం చేయాలని..
హైదరాబాద్: ఆటోవాలాలకు న్యాయం చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫ్లకార్డులు పట్టుకుని అసెంబ్లీ వద్ద ధర్నా చేశారు. అనంతరం శాసనసభకు ఆటోలలో వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో వాలాలకు న్యాయం చేయాలని, ఆత్మహత్య చేసుకున్న ఆటోవాలా కుటుంబాలకు రూ. 15 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని, రాష్ట్ర బడ్జెట్‌లో ఆటోవాలాలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. దీంతో అసెంబ్లీ గేటు ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆటోలు దిగి అసెంబ్లీ లోపలకు వెళ్లారు.
కాగా శుక్రవారం ఉదయం 10 గంటలకు శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం రేవంత్ సభకు వివరిస్తారు. అనంతరం సింగరేణి కంపెనీకి సంబంధించిన 102వ వార్షిక నివేదికను, తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ 6వ నివేదికను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెడతారు. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ 6వ నివేదికను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రవేశపెడతారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను చేపడతారు.