KTR: బీఆర్‌ఎస్ నేతల అరెస్ట్‌ను ఖండించిన కేటీఆర్
ABN , Publish Date - Sep 23 , 2024 | 01:15 PM
Telangana: ‘‘ప్రభుత్వాస్పత్రుల్లో ఉన్న పరిస్థితులను తెలుసుకునేందుకు వెళ్లిన త్రిసభ్య కమిటీ సభ్యులను అరెస్ట్ చేయటమా.. అసలు ప్రభుత్వానికి ఎందుకంత భయం.. కమిటీ తన పని తాను చేసుకొని పోతే నిజం బయటపడుతుందనా..
హైదరాబాద్, సెప్టెంబర్ 23: గాంధీ ఆస్పత్రి వద్ద బీఆర్‌ఎస్ నేతలను అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS working President KTR) తీవ్రంగా ఖండించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. ‘‘ప్రభుత్వాస్పత్రుల్లో ఉన్న పరిస్థితులను తెలుసుకునేందుకు వెళ్లిన త్రిసభ్య కమిటీ సభ్యులను అరెస్ట్ చేయటమా.. అసలు ప్రభుత్వానికి ఎందుకంత భయం.. కమిటీ తన పని తాను చేసుకొని పోతే నిజం బయటపడుతుందనా.. అసమర్థ చేతగాని ప్రభుత్వం (Congress Govt) అసలు రంగు బయట పడుతుందనా’’ అంటూ ట్వీట్ చేశారు..
Harishrao: పోలీసులకు హరీష్‌రావు స్ట్రాంగ్ వార్నింగ్..
‘‘నిజంగా ప్రభుత్వం ఏమీ దాచటం లేదంటే బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీని దర్యాప్తు చేయనివ్వండి. కమిటీ నివేదిక ద్వారా ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వానికి తెలుస్తాయి. ప్రజారోగ్యాన్ని మరింత మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రభుత్వానికి సూచనలు అందుతాయి. కానీ ముఖ్యమంత్రి మాత్రం అవేవి జరగవద్దన్న ఇగోతో వ్యవహరిస్తున్నాడు. తెలంగాణ ప్రజల జీవితాలతో సీఎం చెలగాటం ఆడుతున్నాడు. ఇలాంటి పిచ్చి పనులను సీఎం మానేయాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Supreme Court: ఆ వీడియోలపై సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు
కాగా.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వాస్తవ పరిస్థితులను పరిశీలించేందుకు బీఆర్ఎస్ త్రీ మెన్ కమిటీని నియమించింది. ఈరోజు ఉదయం 10 గంటలకు గాంధీ ఆస్పత్రికి బీఆర్ఎస్ నేతలు తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే సంజయ్, మెతుకు ఆనంద్ వెళ్లాల్సింది. అయితే ముందుగానే అప్రమత్తమైన పోలీసులు కమిటీ మెంబర్స్‌ను హౌజ్ అరెస్ట్ చేశారు. తమను పోలీసులు అడ్డుకుంటున్నారని, హౌజ్ అరెస్టులు చేస్తున్నారని బీఆర్ఎస్ త్రిసభ్య కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. వికారాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. త్రిసభ్య కమిటీలో ఆనంద్ సభ్యుడిగా ఉన్నారు. గాంధీ ఆసుపత్రికి వెళ్లనీయకుండా ఆనంద్‌ను పోలీసులు ఇంట్లోనే ఉంచారు. విషయం తెలిసిన కార్యకర్తలు భారీగా ఆనంద్ ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. ఇంట్లోకి పోలీసులు వెళ్లకుండా కార్యకర్తలు అడ్డంగా కూర్చున్నారు. మరోవైపు ఆనంద్ ఇంటి చుట్టూ పోలీసులు పహారాకాస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
HYDRA: మాదాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు....
Tirumala: తిరుమలలో ముగిసిన మహా శాంతి యాగం
Read latest Telangana News And Telugu News