Share News

KTR: ‘చిట్టినాయుడు సుభాషితాలు’.. రేవంత్‌‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

ABN , Publish Date - Sep 17 , 2024 | 09:32 AM

Telangana: రాజీవ్ గాంధీని ఉద్దేశించి మాట్లాడుతూ కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై కేటీఆర్‌ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. రేవంత్‌ను పరోక్షంగా ‘‘చిట్టినాయుడు’’ అంటూ స్పందిస్తూ ఎద్దేవా చేశారు.

KTR: ‘చిట్టినాయుడు సుభాషితాలు’.. రేవంత్‌‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
BRS Working President KTR

హైదరాబాద్, సెప్టెంబర్ 17: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) మాటల తూటాలు పేలుస్తున్నారు. రోజు రోజుకు సీఎంపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఆరు గ్యారెంటీలపై, రైతు రుణమాఫీ ఎప్పటికప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతూనే ఉన్నారు. తాజాగా నిన్న (సోమవారం) సచివాలయం ఎదుట దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ ఆవిష్కరించారు.

Ganesh Laddu Record: రికార్డులన్నీ బ్రేక్.. సంచలన ధర పలికిన గణేశుడి లడ్డూ


ఈ సందర్భంగా రాజీవ్ గాంధీని ఉద్దేశించి మాట్లాడుతూ కేటీఆర్‌పై సీఎం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై కేటీఆర్‌ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. రేవంత్‌ను పరోక్షంగా ‘‘చిట్టినాయుడు’’ అంటూ స్పందిస్తూ ఎద్దేవా చేశారు. కంప్యూటర్‌ను కనిపెట్టింది రాజీవ్ గాంధీ కాదని.. ఆ సమయంలో రాజీవ్ వయసు 12 సంవత్సరాలు అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.


కేటీఆర్ ట్వీట్ ఇదే..

‘‘చిట్టినాయుడు సుభాషితాలు

రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టిండు

కంప్యూటర్ ను కనిపెట్టింది రాజీవ్ గాంధీ కాదు చార్లెస్ బాబేజీ

రాజీవ్ గాంధీ కంప్యూటర్ దేశానికి పరిచయం చేసిండు

Tata Institute of Fundamental Research Automatic Calculator (TIFRAC) వారు 1956లో ఇండియాలో తొలిసారిగా కంప్యూటర్ సేవలు ప్రారంభించారు

రాజీవ్ గాంధీ గారికి అప్పటికి 12 సంవత్సరాలు

ఏదో నోటికొచ్చింది వాగడం, ఆ తర్వాత దొరికిపోవడం ఎందుకు

నీకు బాగా తెలిసిన రియల్ ఎస్టేట్ దందాలు, బ్లాక్ మెయిల్ వీటికి పరిమితం అయితే మంచిదమ్మా చిట్టి’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

బాబు ప్రభుత్వం @ 100


ఇంతకీ రేవంత్ ఏమన్నారంటే?

నిన్న (సోమవారం) సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజీవ్ విగ్రహం ఏర్పాటుపై బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు రేవంత్. ముఖ్యమంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీ త్యాగం గురించి కొందరికి తెలియదని మండిపడ్డారు. గాంధీ కుటుంబం దేశం కోసం సర్వం త్యాగం చేసిందని గుర్తుచేశారు.


రాజీవ్‌గాంధీ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నా.. సీఎం రేవంత్

‘‘మీ ఫామ్ హౌస్‌లలో జిల్లేడు మొలిపిస్తా. ట్విట్టర్ పిట్ట కేటీఆర్ కంప్యూటర్ తెచ్చిందే రాజీవ్ గాంధీ కదా. లేకపోతే గుంటూరులో ఇడ్లీ,వడ అమ్ముకునే వానివి. నువ్వు ఐటీ శాఖ మంత్రివి అయ్యావు అంటే అది రాజీవ్‌గాంధీ చొరవే. పదవి , ప్రాణ త్యాగం అంటే గాంధీ కుటుంబానిది మాత్రమే. అయ్యా ముఖ్యమంత్రి.. కొడుకు మంత్రి , అల్లుడు ఇరిగేషన్ శాఖ మంత్రి, ఒకరు రాజ్యసభ. గడీలలో గడ్డి మొలిచింది. వేల ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టిన నీకు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి పదేళ్లు సరిపోలేదా. బుద్దుని పక్కన బుద్ధి లేని వాని విగ్రహం పెట్టాలని ఈ స్థలాన్ని రిజర్వ్ చేసి పెట్టిర్రు. ఆ గాడిదలకు బుద్ధి లేదు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసి చూడండి బిడ్డా. ఎవడు వస్తాడోరండి దారి చెప్పండి. నేను చూస్తా. రాజీవ్‌గాంధీ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ తల్లి విగ్రహాన్ని దేశం అబ్బురపడే రీతిలో చేస్తాం. కొండా లక్ష్మణ్ బాపూజీకి విలువ ఇవ్వని సన్నాసి కేసీఆర్. నువ్వు నీ కొడుకు తెగించి దోచుకోవడం. కాలకేయ ముఠా, మీడత దండు నుంచి తెలంగాణను కాపాడుకుందాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి సంచలన విమర్శలు చేశారు.


ఇవి కూడా చదవండి...

Diamond: అదృష్టం అంటే ఇదే.. రైతు కూలీకి 8క్యారెట్ల వజ్రం..

Kolkata: మాజీ ప్రిన్సిపాల్ ప్రొ. ఘోష్ ఫామ్ హౌస్‌లో ఈడీ సోదాలు


Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 17 , 2024 | 11:33 AM