Share News

KTR: వాళ్ల మెప్పు కోసమే రాజీవ్ విగ్రహ స్థాపన

ABN , Publish Date - Sep 17 , 2024 | 11:54 AM

Telangana: గతంలో సోనియాగాంధీని బలిదేవత అని, రాహుల్ గాంధీని ముద్దపప్పు అని తిట్టారని.. ఇప్పుడు వాటిని కవర్ చేసుకోవడానికి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టాడని రేవంత్ రెడ్డి చెప్తున్నారని... కంప్యూటర్ కనిపెట్టిన ఛార్లెస్ బాబేజ్ ఆత్మ ఎక్కడున్నా బాధపడుతుందంటూ ఎద్దేవా చేశారు.

KTR: వాళ్ల మెప్పు కోసమే రాజీవ్ విగ్రహ స్థాపన
BRS Working President KTR

హైదరాబాద్, సెప్టెంబర్ 17: ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే సచివాలయం ఎదుట దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) విగ్రహాన్ని స్థాపించారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు సెప్టెంబర్ 17 సందర్భంగా తెలంగాణ భవన్‌లో జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను మాజీ మంత్రి ఆవిష్కరించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. గతంలో సోనియాగాంధీని బలిదేవత అని, రాహుల్ గాంధీని ముద్దపప్పు అని తిట్టారని.. ఇప్పుడు వాటిని కవర్ చేసుకోవడానికి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టాడని రేవంత్ రెడ్డి చెప్తున్నారని... కంప్యూటర్ కనిపెట్టిన ఛార్లెస్ బాబేజ్ ఆత్మ ఎక్కడున్నా బాధపడుతుందంటూ ఎద్దేవా చేశారు.

YS Jagan: పదైదు వేల గతం.. మరిచావా జగన్‌?


మీకు చేతనైతే..

‘‘మీకు చేతనైతే హామీలు అమలు చేయండి.. 420 అడ్డగోలు హామీలు అమలు చేయండి. చేతనైతే రైతు బందు ఇవ్వండి వానాకాలంకు 14 రోజులే మిగిలింది. చేతనైతే కరెంటు సరిగా ఇవ్వండి. చేతనైతే పింఛన్లు, మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేతనైతే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి’’ అంటూ హితవుపలికారు. పోలీస్ బండ్లల్లో డీజిల్ పోయడానికి నిధులు ఇవ్వడంలేదని విమర్శించారు. రామగుండంలో రూ.2 కోట్లు డీజిల్ బిల్లులు పెండింగ్ ఉన్నాయన్నారు. అక్కడ బంకు వాళ్లు పోలీస్ బండ్లకు డీజిల్ పోయడం లేదని తెలిపారు. ఇంకో 14 రోజుల్లో వర్షాకాలం ముగుస్తుందని.. ఇప్పటికీ రైతు భరోసా ఇవ్వలేదని మండిపడ్డారు.


రాష్ట్రంలో పాలన లేదు.... కానీ

రాగానే పెన్షన్ రూ.4000 అన్నారు అది లేదని.. మహిళలకు రూ. 2500 అన్నారని.. చేతనైతే అది ఇవ్వండి అంటూ వ్యాఖ్యలు చేశారు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అన్నారని... 9 నెలలు అయిపోయిందని ఉద్యోగాల ప్రస్తావన లేదని... చేతనైతే ఇవ్వని చేసి చుపెట్టాలన్నారు. ఈ రాష్ట్రంలో ఇంతవరకు పాలన అనేది లేదని..కానీ రేవంత్ రెడ్డి ఇవాళ ప్రజపాలన దినోత్సవం జరుపుతున్నారని మాజీ మంత్రి మండిపడ్డారు.

CM Revanth: కొత్త ఒరవడికి సీఎం నాంది.. నిమజ్జన వేడుకల్లో రేవంత్



కేసీఆర్‌ను తిట్టడమే పనిగా..

గురుకులాల్లో విద్యార్థులు విష ఆహారం తిని అవస్థలు పడుతున్నారని తెలిపారు. గురుకుల విద్యార్థినులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. గురుకుల టీచర్లను 2500 మందిని తీసీ పక్కన పెట్టారన్నారు. రాష్ట్రంలో పారిశుధ్యం పడకేసిందని.. ఎక్కడ చూసినా చికెన్ గున్యాలు, డెంగ్యూలు, విష జ్వరాలు ప్రబలుతున్నాయన్నారు. పల్లెల్లో ప్రజలు దోమల బారిన పడుతున్న పిచికారి లేదన్నారు. హోంగార్డులకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టే విధంగా పరిస్థితి ఉందన్నారు. ఏ ఇంట్లో చూసినా పిల్లలు జ్వరాల బారిన పడి బాధపడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉంటే ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం కేసీఆర్‌ను బీఆర్ఎస్ నాయకులను తిట్టడమే రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


రాష్ట్రవ్యాప్త నిరసనలకు..

మరోవైపు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు కేటీఆర్ పిలునిచ్చిన విషయం తెలిసిందే. ముందుగా తెలంగాణ భవన్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు కేటీఆర్. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో మాజీ మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి...

Special Buses: వినాయక నిమజ్జనాల వేళ ట్రాఫిక్ కష్టాలకు టీజీఎస్ఆర్టీసీ చెక్..

Konda Surekha: రైతు భరోసాపై మంత్రి కొండా సురేఖ ఏమన్నారంటే?

Read LatestTelangana NewsAndTelugu News

Updated Date - Sep 17 , 2024 | 12:00 PM