Share News

KTR: ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు.. కేటీఆర్ ట్వీట్

ABN , Publish Date - Oct 02 , 2024 | 09:47 AM

Telangana: ‘‘ప్రకృతిని ఆరాధిస్తూ.. తీరొక్క పువ్వులను దేవతా స్వరూపంగా భావించి పూజించే ఏకైక పండుగ మన బతుకమ్మ.. తెలంగాణ సంస్కృతికి చిహ్నం, అస్తిత్వానికి ప్రతిరూపం మన బతుకమ్మ. సమైక్య పాలనలో ఆదరణకు నోచుకోని మన బతుకమ్మ పండుగ’’..

KTR: ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు.. కేటీఆర్ ట్వీట్
BRS working President KTR

హైదరాబాద్, అక్టోబర్ 2: తెలంగాణ (Telangana) సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ సంబురాలు నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదలుకానున్నాయి. ఈరోజు నుంచి తొమ్మిదిరోజుల పాటు పూల పండుగను జరుపుకోనున్నారు తెలంగాణ ఆడపడుచులు. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో పండుగ షురూ కానుంది. ఒక్కో రోజు ఒక్కో పేరుతో పిలుస్తూ బతుకమ్మ పండుగను మహిళలు జరుపుకోనున్నారు.

Gold And Silver Rates: పసిడి ప్రియులకు శుభవార్త


ప్రతీ రోజు ఒక్కో రకం నైవేద్యాన్ని తయారు చేస్తారు. అలాగే వివిధ రకాల పూలతో బతుకమ్మను పేరుస్తారు. ఈ పండుగకు పెళ్లైన ఆడపడుచులు తమ పుట్టింటికి వచ్చి బతుకమ్మను పేర్చి సంబరాల్లో పాల్గొంటారు. ఈరోజు నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ ఆడపడుచులకు పూల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ విషెస్ తెలిపారు.

కాలి నడకన కొండకు పవన్‌


కేటీఆర్ ట్వీట్..

నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు ఆడపడుచులందరూ ఎంతో సంబురంగా జరుపుకునే బతుకమ్మ పండగ తెలంగాణ ప్రజలకు ఎంతో ప్రత్యేకమైనదన్నారు. ‘‘ప్రకృతిని ఆరాధిస్తూ.. తీరొక్క పువ్వులను దేవతా స్వరూపంగా భావించి పూజించే ఏకైక పండుగ మన బతుకమ్మ.. తెలంగాణ సంస్కృతికి చిహ్నం, అస్తిత్వానికి ప్రతిరూపం మన బతుకమ్మ. సమైక్య పాలనలో ఆదరణకు నోచుకోని మన బతుకమ్మ పండుగ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. ఆటపాటలతో, ఆనందోత్సాహాల మధ్య తెలంగాణ ఆడబిడ్డలందరూ బతుకమ్మ పండుగ జరుపుకోవాలని కోరుతూ...ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు ’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

విద్యార్థినిపై స్నేహితుల అత్యాచారం

ఖాళీ చేసిన ఇళ్ల కూల్చివేత

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 02 , 2024 | 09:51 AM