Share News

TS News: గంజాయి అమ్ముతూ పట్టుబడ్డ బీటెక్‌ స్టూడెంట్స్

ABN , Publish Date - Mar 06 , 2024 | 09:38 AM

Telangana: మేడ్చల్ జిల్లాలోని అన్నోజిగూడ అపార్ట్‌మెంట్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. దాదాపు మూడు కిలోల గంజాయిని ఎక్సైజ్ ఇన్ఫోస్ట్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు బీటెక్ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ అరకు నుంచి గంజాయిని తీసుకొచ్చి హైదరాబాదులో అమ్ముతున్నట్లు గుర్తించారు.

TS News: గంజాయి అమ్ముతూ పట్టుబడ్డ బీటెక్‌ స్టూడెంట్స్

మేడ్చల్ జిల్లా, మార్చి 6: మేడ్చల్ జిల్లాలోని అన్నోజిగూడ అపార్ట్‌మెంట్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. దాదాపు మూడు కిలోల గంజాయిని ఎక్సైజ్ ఇన్ఫోస్ట్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు బీటెక్ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ అరకు నుంచి గంజాయిని తీసుకొచ్చి హైదరాబాదులో అమ్ముతున్నట్లు గుర్తించారు. మేడ్చల్ జిల్లా(Medchal) ఘట్‌కేసర్ అన్నాజిగూడా చౌరస్తా వద్ద ఉన్న అపార్ట్‌మెంట్‌లో గంజాయి సరఫరా చేస్తున్నట్లు సమాచారం. విశ్వసనీయమైన సమాచారంతో గత రాత్రి రంగారెడ్డి జిల్లా (Rangareddy) ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గంజాయిని పట్టుకున్నారు. ఘట్కేసర్‌లో ఇంజనీరింగ్ కళాశాలలు ఎక్కువగా ఉండడంతో ఇద్దరు బిటెక్ స్టూడెంట్స్ఇక్కడనే మకాం పెట్టి అమ్ముతున్నట్లు తెలుస్తోంది. వీరిని రంగారెడ్డి ఇన్ఫోస్ట్మెంట్ సీఐ సుభాష్, సీఐ బాలరాజ్ టీం పట్టుకొని ఘట్కేసర్ ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొన్న ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి...

PM Modi: దేశంలోనే మొట్టమొదటి అండర్ రివర్ మెట్రో.. నేడు ప్రారంభించనున్న మోదీ

TS News: 3న పెళ్లి రిసెప్షన్.. తిరుపతికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. పెళ్లికూతురు సహా పెళ్లి కొడుకు కుటుంబమంతా మృతి


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 06 , 2024 | 11:23 AM