Cast Census: తెలంగాణ వ్యాప్తంగా కులగణన ప్రారంభం
ABN , Publish Date - Nov 06 , 2024 | 10:20 AM
Telangana: తెలంగాణ వ్యాప్తంగా కులగణన ప్రారంభమైంది. బుధవారం ఉదయం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కులగణను ప్రారంభించారు. ఈరోజు నుంచి మొదటి రెండు రోజులు ఇంటింటికి వెళ్లి సర్వే సమాచారాన్ని సిబ్బంది ఇవ్వనున్నారు. ఆ తరువాత నవంబర్ 9 నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే మొదలుకానుంది.
హైదరాబాద్, నవంబర్ 6: తెలంగాణ (Telangana) వ్యాప్తంగా కులగణన ప్రారంభమైంది. బుధవారం ఉదయం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) సర్వేను ప్రారంభించారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు రేవంత్ సర్కార్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సర్వే కోసం 80 వేల మంది ఇన్యుమరెటర్లు, 18 వేల మంది సూపర్ వైజర్లకు శిక్షణ పూర్తి అయ్యింది. గ్రేటర్ హైదరాబాద్‌లో సర్వే కోసం 18, 723 మంది ఇన్యుమరెటర్లు, 1870 మంది సూపర్ వైజర్లను ప్రభుత్వం నియమించింది.
TTD: టీటీడీ చైర్మన్‌గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు ప్రమాణం
గ్రేటర్‌లో నేటి నుంచి 8 వరకు అంటే.. రెండు రోజుల పాటు మొదట ఇంటింటికి వెళ్లి సర్వే సమాచారాన్ని సిబ్బంది ఇవ్వనుంది. సిబ్బంది..ఇంటింటికి వెళ్లి స్టిక్కర్స్ అంటించి సర్వే సమాచారం ఇన్యుమారేటర్లు ఇవ్వనున్నారు. నవంబర్ 9 నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను మొదలుపెట్టనున్నారు. సర్వేలో మొత్తం 75 ప్రశ్నలతో కుటుంబ సమాచారం సేకరణ ఉంటుంది. అందులో 56 ప్రధాన ప్రశ్నలు కాగా.. మరో 19 అనుబంధ ప్రశ్నలు ఉంటాయి. రెండు పార్టులుగా పార్టు-1, పార్టు-2గా ఎనిమిది పేజీల్లో సర్వే పత్రాలను సిద్ధం చేశారు.
పార్టు-1లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలు ఉంటాయి. సర్వేలో సాధారణ, విద్య, ఉద్యోగ, ఉపాధి, భూములు, రిజర్వేషన్ ప్రయోజనాలు, వలసలు, రాజకీయ, కుల సమాచారం సేకరణ ఉంటుంది. పార్టు-2లో కుటుంబ వివరాలను సేకరిస్తారు.ఇందులో మొత్తం 17 ప్రశ్నల్లో ఏడు ప్రధాన ప్రశ్నలు ఉండగా, మిగిలినవి అనుబంధ ప్రశ్నలు ఉండనున్నాయి. సర్వే సందర్భంగా ఫొటోలు తీయడం - పత్రాలు తీసుకోవడం లాంటివి ఉండవు. కుటుంబం మొత్తం ఉండాల్సిన అవసరం లేదు.
US Election Counting: అమెరికా ఎన్నికల ఫలితాల ట్రెండ్ ఇదే.. డెమొక్రాట్లకు బైడెన్ అభినందనలు
కుటుంబ యజమాని వివరాలు అందిస్తే చాలు. సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల వివరాలు ఇన్యుమరేటర్లు సేకరించనున్నారు. ఏ రోజు వివరాలు అదే రోజు కంప్యూటర్‌లో నమోదు కానున్నాయి. డిసెంబర్ 8 వరకు సర్వే పూర్తి అవనుంది. డిసెంబర్ 9న ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేస్తారు. కులగణన కోసం డెడికేషన్ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సర్వే రిపోర్ట్ ఆధారంగానే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారుకానున్నాయి. కుల గణన అనంతరం పంచాయితీ ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో రేవంత్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఈ బైక్ ఎలా నడుస్తోందబ్బా.. పెట్రోల్ లేదు, పెడల్ లేదు.. గాలిలో దూసుకుపోతున్న బైక్..
Hyderabad: గోల్డ్ స్కీమ్‌లో చేరాలని ఫోన్లు వస్తున్నాయా.. అయితే..
Read Latest Telangana News And Telugu News