TG News: ఫార్మాలిటీస్ పేరుతో ఆలస్యం.. గాల్లో కలిసిన బాలిక ప్రాణం
ABN , Publish Date - Aug 21 , 2024 | 01:23 PM
Telangana: ‘‘వైద్యో నారాయణో హరి’’.. వైద్యులు దేవుళ్లతో సమానమంటారు పెద్దలు. అత్యవసరంగా వచ్చిన వారికి వైద్యం అందిచడం అనేది డాక్టర్ల ధర్మం. కానీ ఓ చిన్నారి విషయంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నిండుప్రాణం బలైంది. ఫార్మాలిటీ పేరుతో ఓ చిన్నారి మృతకి కారణమైంది పారమిత ఆస్పత్రి. హాస్పటల్‌లో ఫార్మాలిటీని పూర్తి చేయడానికి అరగంట సమయం పట్టింది...
హైదరాబాద్, ఆగస్టు 21: ‘‘వైద్యో నారాయణో హరి’’.. వైద్యులు దేవుళ్లతో సమానమంటారు పెద్దలు. అత్యవసరంగా వచ్చిన వారికి వైద్యం అందిచడం అనేది డాక్టర్ల ధర్మం. కానీ ఓ చిన్నారి విషయంలో వైద్యుల (Doctors) నిర్లక్ష్యం కారణంగా నిండుప్రాణం బలైంది. ఫార్మాలిటీ పేరుతో ఓ చిన్నారి మృతకి కారణమైంది పారమిత ఆస్పత్రి. హాస్పటల్‌లో ఫార్మాలిటీని పూర్తి చేయడానికి అరగంట సమయం పట్టింది... ఈ లోపే బాలిక ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన వారికి.. ఫార్మాలిటీని కూడా పక్కన పెట్టి వైద్యం అందించవలసిన వైద్యులు వాటి పేరుతో నిర్లక్ష్యం చేయడంతో బాలిక మృతికి కారణమయ్యారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
Hyderabad: ఫిర్యాదుల వరద.. నాగార్జునకు షాక్ తప్పదా..!?
చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలోని కొత్తపేటలో ఉన్న పారమిత చిన్న పిల్లల ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి అదిర (6) అనే చిన్నారి మృతి చెందింది. నల్గొండ జిల్లా పానగల్‌కు చెందిన చింత అజయ్ బాబు కుమార్తె అధిర వైరల్ ఇన్ఫెక్షన్‌తో జ్వరంరాగా స్థానిక ఆసుపత్రిలో చూపించారు. అయితే చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని.. హైదరాబాద్‌కు తీసుకువెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో హుటాహుటిన చిన్నారిని చైతన్యపురిలోని పారమిత ఆసుపత్రికి అర్థరాత్రి తీసుకువచ్చారు.
TG Highcourt: వివేకా కేసులో ఉదయ్‌కు బెయిల్ మంజూరు
డ్యూటీ డాక్టర్ చూసి ఓపీ.. అడ్మిషన్ తీసుకొనిరమ్మని చెప్పారు. అయితే అవనీ చేసుకుని వచ్చేసరికి బాలిక ప్రాణాలు కోల్పోయింది. ‘‘అయితే అడ్మిషన్ వద్ద మాకు అక్కడ లేట్ కావడంతో.. మీరు అడ్మిషన్ తీసుకోవడం లేట్ అయిందనీ అందుకే ట్రీట్మెంట్ లేట్ అయింది’’ అంటూ వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని చిన్నారి తల్లిదండ్రుల ఆరోపించారు. ‘‘మా పాపకు ఎలాంటి ట్రీట్మెంట్ చేయకపోగా, నా పాప అక్కడిక్కడే స్పృహ కోల్పోయి పడిపోయింది. మా పాప మృతికి ప్రధాన కారణం వైద్యుల నిర్లక్ష్యమే’’ అని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలంటూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అయితే విషయం తెలిసిన చైతన్యపురి పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి...
Hyderabad: ఫిర్యాదుల వరద.. నాగార్జునకు షాక్ తప్పదా..!?
Ponguleti Srinivas: టూరిజం ప్లేస్‌గా నేలకొండపల్లి అభివృద్ధే లక్ష్యం..
Read latest Telangana News And Telugu News