Share News

TG HighCourt: జన్వాడ ఫాంహౌస్ కూల్చొద్దంటూ హైకోర్టులో పిటిషన్

ABN , Publish Date - Aug 21 , 2024 | 12:20 PM

Telangana: నగరంలో ఆపరేషన్ హైడ్రా కొనసాగుతూనే ఉంది. అక్రమనిర్మాణాలే లక్ష్యంగా హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) చెలరేగిపోతోంది. ఎల్‌టీఎఫ్ పరిధిలో ఉన్న నిర్మాణలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. ఈ క్రమంలో జన్వాడ ఫౌంహౌస్ ఎఫ్ టీ ఎల్ పరిధిలో ఉండడంతో తమ కట్టడాలను హైడ్రా కూల్చే అవకాశం ఉందని ముందస్తుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.

TG HighCourt: జన్వాడ ఫాంహౌస్ కూల్చొద్దంటూ హైకోర్టులో పిటిషన్
Telangana High Court

హైదరాబాద్, ఆగస్టు 21: నగరంలో ఆపరేషన్ హైడ్రా (Hydra) కొనసాగుతూనే ఉంది. అక్రమనిర్మాణాలే లక్ష్యంగా హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) చెలరేగిపోతోంది. ఎల్‌టీఎఫ్ పరిధిలో ఉన్న నిర్మాణలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. ఈ క్రమంలో జన్వాడ ఫౌంహౌస్ ఎఫ్ టీ ఎల్ పరిధిలో ఉండడంతో తమ కట్టడాలను హైడ్రా కూల్చే అవకాశం ఉందని ముందస్తుగా హైకోర్టులో (Telangana HighCourt) పిటిషన్ దాఖలు అయ్యింది. జన్వాడ ఫాంహౌస్‌ను కూల్చవద్దంటూ బీఆర్‌ఎస్ నేత ప్రవీణ్ రెడ్డి హైకోర్టుకు వెళ్లారు. హైడ్రా కూల్చకుండా స్టే ఇవ్వాలని న్యాయస్థానంలో ప్రవీణ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం, హైడ్రా కమిషన్, రంగారెడ్డి కలెక్టర్, శంకర్ పల్లి రెవిన్యూ అధికారి, చీఫ్ ఇంజనీర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులను ప్రతి వాదులుగా పిటిషనర్ చేర్చారు.

TG Highcourt: వివేకా కేసులో ఉదయ్‌కు బెయిల్ మంజూరు


కాగా.. నగరంలో హైడ్రా ఆపరేషన్ కొనసాగుతోంది. గత ఆదివారం(ఆగస్టు 18) రంగారెడ్డి జిల్లా గండిపేట్ చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో నిర్మించిన భారీ భవనాలు, చెరువులో నిర్మించిన అపార్ట్‌మెంట్లను నేలమట్టం చేశారు. హైడ్రా కమీషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదులు రావడంతో హైడ్రా బృందం రంగంలోకి దిగింది. పటిష్ట బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కూల్చివేతలను అడ్డుకున్న స్థానికులను అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే నగరంలోని గండిపేట చెరువు చుట్టూ ఉన్న అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ చేసింది. ఐదు రోజుల్లో ఆపరేషన్ గండిపేట పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. గండిపేట చెరువు బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేస్తున్నారు. మరోవైపు చిలుకూరు, నార్సింగ్ మండలం ఖానాపూర్‌లలో భారీ భవనాలను కూడా కూల్చివేయనున్నారు.

Hyderabad: ఫిర్యాదుల వరద.. నాగార్జునకు షాక్ తప్పదా..!?


గుండెల్లో గుబులు...

మరోవైపు జంట జలాశయాల పరిరక్షణ లక్ష్యంగా హైడ్రా చేపట్టిన ఆపరేషన్‌తో ప్రముఖుల గుండెల్లో గుబులు మొదలైనట్లు తెలుస్తోంది. ముచ్చటపడి కట్టుకున్న ఫామ్‌హౌస్‌లు, పచ్చటి ప్రకృతి అందాల మధ్య నిర్మించుకున్న భవనాలు ఎక్కడ నేలమట్టమవుతాయో అన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. దీంతో.. హైడ్రా పంజా తమ నిర్మాణాల దాకా రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మంత్రులు, ఉన్నతాధికారుల ద్వారా మంత్రాంగం మొదలెట్టినట్లు తెలుస్తోంది. అయితే.. హైడ్రా వర్గాలు మాత్రం.. ‘ఒత్తిళ్లకు తలొగ్గం.. ఫుల్‌ ట్యాంక్‌ లెవెల్‌ (ఎఫ్‌టీఎల్‌), బఫర్‌ జోన్‌లో ఉన్న నిర్మాణాలను కూల్చకుండా వదలం’ అని తేల్చిచెబుతున్నా యి. వరుస కూల్చివేతల నేపథ్యంలో రెండు రోజులు బ్రేక్‌ ఇచ్చామని.. త్వరలో మళ్లీ ఆపరేషన్‌ డిమాలిషన్‌ మొదలవుతుందని ఓ అధికారి చెప్పారు. మరోవైపు, హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌.. సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో సమావేశమయ్యారు. గండిపేటలో కూల్చిన భవనాలు, ప్రహరీ గోడ ల వివరాలను రంగనాథ్‌ ప్రభుత్వానికి సమర్పించారని తెలిసింది. హిమాయత్‌సాగర్‌ ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో గుర్తించిన నిర్మాణాల సమాచారమూ అందించినట్టు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి...

Trains: పలురైళ్ల రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు

Narendra Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. పోలాండ్, ఉక్రెయిన్‌లో మూడు రోజుల పర్యటన!

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 21 , 2024 | 01:01 PM