Share News

TS NEWS: పదేళ్ల తర్వాత మొదటిసారి సీఐడీ కేసు నమోదు.. ఎక్కడంటే..?

ABN , Publish Date - Jan 20 , 2024 | 09:58 PM

పదేళ్ల తర్వాత సీఐడీ అధికారులు తెలంగాణలో మొదటిసారి కేసు నమోదు చేశారు. నకిలీ వీసా పాస్‌పోర్టులు ఇప్పిస్తున్న ముఠాని సీఐడీ అధికారులు పట్టుకున్నారు.

TS NEWS: పదేళ్ల తర్వాత మొదటిసారి సీఐడీ కేసు నమోదు.. ఎక్కడంటే..?

హైదరాబాద్: పదేళ్ల తర్వాత సీఐడీ అధికారులు తెలంగాణలో మొదటిసారి కేసు నమోదు చేశారు. నకిలీ వీసా పాస్‌పోర్టులు ఇప్పిస్తున్న ముఠాని సీఐడీ అధికారులు పట్టుకున్నారు. ఐదు జిల్లాల్లో సీఐడీ అధికారులు మూకుమ్మడిగా సోదాలు నిర్వహించారు. తెలంగాణలో సీఐడీ అధికారులు సోదాలు చేశారు. హైదరాబాద్, జగిత్యాల, కోరుట్ల నిజామాబాద్, కరీంనగర్లలోని సోదాలు చేశారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో పాస్‌పోర్టులు ఇప్పిస్తున్న ముఠాని చాకచక్యంగా పట్టుకున్నారు. విదేశీయులకు పాస్‌పోర్టులు పొందేందుకు అవసరమైన నకిలీ పత్రాలు తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. నకిలీ పత్రాలతో పాస్‌పోర్ట్ స్లాట్‌లను ముఠా బుక్ చేస్తుంది. ఇప్పటి వరకు వందమంది విదేశీయులకు ఇండియన్ పాస్‌పోర్టులను అందజేసింది. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లను తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. 108 పాస్‌పోర్టులు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు అబ్దుస్ సత్తార్ ఉస్మాన్ అల్ జవహరి అరెస్ట్ చేశారు. జవహరితో పాటు మరో 11 మందిని సీఐడీ బృందం అరెస్టు చేసింది. శ్రీలంక దేశం నుంచి వచ్చిన రెఫ్యూజీలకు ముఠా పాస్‌పోర్ట్‌లను ఇప్పిస్తున్నట్లు సీఐడీ అధికారులు తెలిపారు.

Updated Date - Jan 20 , 2024 | 09:58 PM