Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

CM Revanth: ట్యాంక్ బండ్‌పై వారి విగ్రహాలు.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 02 , 2024 | 10:31 PM

నగరంలోని ట్యాంక్ బండ్‌‌పై చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్నలాంటి తెలంగాణ ప్రముఖుల విగ్రహాల ఏర్పాటును పరిశీలిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. త్వరలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి విధానపరంగా మంచి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ట్యాంక్ బండ్‌పై ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయాలన్న వక్తల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు.

CM Revanth: ట్యాంక్ బండ్‌పై వారి విగ్రహాలు.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: నగరంలోని ట్యాంక్ బండ్‌‌పై చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్నలాంటి తెలంగాణ ప్రముఖుల విగ్రహాల ఏర్పాటును పరిశీలిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. త్వరలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి విధానపరంగా మంచి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ట్యాంక్ బండ్‌పై ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయాలన్న వక్తల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. శనివారం నాడు రవీంద్రభారతిలో ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి ఉత్సవాలు జరిగాయి. ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలి స్పీకర్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, ఇతర నేతలు హాజరయ్యారు. స్వర్గీయ శ్రీపాదరావు చిత్రపటానికి సీఎం, మంత్రులు నివాళులు అర్పించారు.

శ్రీపాదరావు ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ స్పీకర్‌గా శ్రీపాదరావు కీలక పాత్ర పోషించారని తెలిపారు. మంథని నుంచి మూడుసార్లు శ్రీపాదరావు ఎమ్మెల్యేగా గెలుపొందారని అన్నారు. ఆయన లాంటి నాయకులు తెలంగాణకు గర్వకారణమని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వంలో శ్రీధర్ బాబు అన్నీ తానై వ్యవహరిస్తున్నారని తెలిపారు. శ్రీపాదరావు వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన శ్రీధర్ బాబు తనను తాను నిరూపించుకున్నారని వివరించారు. ప్రయోజకుడిగా మారిన శ్రీధర్ బాబును ఇప్పుడు చూస్తే శ్రీపాదరావు సంతోషించేవారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Mar 02 , 2024 | 10:31 PM