CM Revanth: కేసీఆర్‌కు రాజకీయ జీవితం ఇచ్చిందే కాంగ్రెస్
ABN , Publish Date - Aug 01 , 2024 | 03:16 PM
బీఆర్ఎస్ నేతలు ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రాజకీయ జీవితం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తుచేశారు. హరీష్‌రావును కూడా గతంలో మంత్రిగా కాంగ్రెస్ చేయలేదా..? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలు ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రాజకీయ జీవితం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తుచేశారు. హరీష్‌రావును కూడా గతంలో మంత్రిగా కాంగ్రెస్ చేయలేదా..? అని ప్రశ్నించారు. గురువారం నాడు తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో ఉద్దండులైన న్యాయవాదులతో వాదించేలా కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ALSO Read: TG Assembly: ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. నేడు 3 బిల్లులను ప్రవేశపెడుతున్న ప్రభుత్వం
వారిని నా సొంత అక్కలుగానే భావించా..
‘‘బీఆర్ఎస్ మహిళ ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలను నేను నా సొంత అక్కలుగానే భావించా. సీతక్కపై సోషల్ మీడియాలో అవమానించేలా మీమ్స్ పెడుతున్నారు. ఆదివాసీ ఆడబిడ్డను అవమానించినట్లు కాదా..? సొంత చెల్లెల్ని జైల్లో పెట్టినా ఢిల్లీ వెళ్లి రాజకీయ ఒప్పందం చేసుకున్న నీచులు వారు. అక్కా మీరు వాళ్ల ఉచ్చులో పడొద్దు. మీ ముందు కింద కూర్చో కూడదనే కేసీఆర్ సభకు రావడం లేదు. మైక్ ఇస్తే శాపనార్థాలు.. ఇవ్వకపోతే పోడియం దగ్గర నిరసనలు చేస్తున్నారు. నేను చెల్లెలు జైల్లో ఉంటే రాజకీయాల కోసం బజార్‌లో తిరిగేవాడిని కాదు. దొర పన్నిన కుట్రలో మా అక్కలు బందీ అయ్యారు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్ నేతలకు దేవుడు జ్ఞానం ప్రసాదించాలి..
‘‘అక్కల క్షేమం కోరే చెబుతున్నా... వాళ్ల ఉచ్చులో పడొద్దు. దళిత బిడ్డలు సంతోషపడే రోజు వస్తే నిలబడాల్సిన అవసరం ఉంది. కానీ ప్రధాన ప్రతిపక్షం వాకౌట్ చేసి వెళ్లిపోయింది. అందుకే వాళ్ల నుంచి ఏమైనా ఆశిస్తే.. కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టే. వాళ్లకు దేవుడు జ్ఞానం ప్రసాదించాలని కోరుకుంటున్నా. సాయంత్రం స్కిల్స్ యూనివర్సిటీ భూమిపూజకు రావాల్సిందిగా అందరినీ కోరుతున్నా. బీఆర్ఎస్ నేతలకు రాజకీయ ప్రయోజనం తప్ప.. ప్రజల ప్రయోజనం పట్టదు. రైతు రుణమాఫీపై చర్చ జరగకూడదని బీఆర్ఎస్ నేతలు ఆడబిడ్డలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. స్కిల్స్ యూనివర్సిటీపై చర్చ జరగకూడదని అడ్డుకోవాలని చూస్తున్నారు’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALSO Read: Hyderabad: స్మితా సబర్వాల్‌ను తొలగించాలంటూ నిరసన
వర్గీకరణపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..
మరోవైపు.. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు (Supreme Court)తీర్పు నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీలో (Telangana Assembly) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు మాదిగ, మాల ఉప కులాలకు వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే గత ప్రభుత్వం సంపత్ కుమార్‌ను సస్పెండ్ చేసిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. 2023 డిసెంబర్ 23న ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, దామోదర రాజనర్సింహ అడ్వకేట్ జనరల్‌ను సుప్రీంకోర్టుకు పంపించారని అన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టులో న్యాయ నిపుణులతో వాదనలు వినిపించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
మా ప్రయత్నం ఫలించింది..
తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించిందన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇప్పుడు అమల్లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్‌లో కూడా మాదిగ, మాల ఉప కులాలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని అన్నారు. ఇందుకోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకువస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Revanth: వర్గీకరణపై సుప్రీం తీర్పుపై అసెంబ్లీలో సీఎం రేవంత్ ఏమన్నారంటే?
TG Assembly Sessions: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్..
Read Latest Telangana News And Telugu News